గురువారం 13 ఆగస్టు 2020
Vikarabad - Jul 01, 2020 , 22:46:18

ఆబాది భూములపై హక్కు ప్రభుత్వానిదే..

ఆబాది భూములపై హక్కు ప్రభుత్వానిదే..

కొత్తూరు: కోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ భూములను కొందరు కబ్జాచేసి అమ్మేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్తూరు పంచాయతీ కుమ్మరిగూడ పరిధిలోని సయ్యద్‌ అలీగూడలో ఆబాది (గ్రామకంఠం) భూమి 4.08 ఎకరాలు, కొత్తూరు తండాలో ప్రభుత్వ భూమి 12 గుంటలు కొన్నేండ్లుగా కబ్జాకు గురయ్యాయి. కొత్తూరు గ్రామస్తుల ఫిర్యాదుమేరకు ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మంజులత, కొత్తూరు, కుమ్మరిగూడ, కొత్తూరు తండా గ్రామస్తులతో గ్రామసభ నిర్వహించారు. అనంతరం మొత్తం 4.20 ఎకరాల భూమిని బుధవారం పంచాయతీ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ భూమిలో పంచాయతీ బోర్డును ఏర్పాటుచేశారు. దీంతో కొత్తూరులో సుమారు రూ.7 కోట్ల విలువ చేసే భూమిని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ స్థలంలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ, డబుల్‌ బెడ్రూం ఇండ్లు, కూరగాయల మార్కెట్‌ నిర్మాణం వంటి పనులు చేపట్టేందుకు కృషి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సర్వే నంబర్‌ 24లో గల రెండెకరాల భూమిని కూడా తమ ఆధీనంలోకి తీసుకుని ప్రజావసరాలకు అనుగుణంగా వాడుకలోకి తీసుకురానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 


logo