మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - Jul 01, 2020 , 22:36:40

మొక్కలు నాటి సంరక్షించాలి

మొక్కలు నాటి సంరక్షించాలి

మర్పల్లి : ప్రతిఒక్కరూ హరితహారంలో పాల్గొని మొక్క లు నాటి, సంరక్షించాలని ఎంపీపీ లలిత, జడ్పీటీసీ మధుకర్‌ అన్నారు. బుధవారం మండలంలోని షాపూర్‌, తుమ్మలపల్లి గ్రామాల్లో ఎస్‌ఐ సతీశ్‌, సర్పంచ్‌లు సాలిబాయి, హంసమ్మతో కలిసి ఆరో విడుత హరితహారం కార్యక్రమం లో భాగంగా మొక్కలు నాటారు. తుమ్మలపల్లిలో గ్రామస్తులకు చెత్త బుట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ మొక్క లు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ మోహన్‌రెడ్డి, ఎంపీడీవో సురేశ్‌బాబు, ఏపీ వో అంజిరెడ్డి, ఎంపీటీసీ మల్లేశం, సొసైటీ వైస్‌ చైర్మన్‌ ఫసియోద్దీన్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, మాజీ కో-ఆప్షన్‌ సభ్యుడు తాజుద్దీన్‌, నాయకులు,  కార్యకర్తలు పాల్గొన్నారు.

పచ్చదనం పెంచాలి

బొంరాస్‌పేట : హరితహారంలో ప్రతి ఒక్కరూ పాల్గొని పచ్చదనం పెంచాలని ఎస్‌ఐ వెంకటశీను అన్నారు. మండలంలోని దుప్‌చెర్లలో రైతు రత్నాకర్‌రెడ్డి పొలంలో, పంచాయతీ ఆవరణలో 500 టేకు, అల్లనేరేడు మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ లక్ష్మీనారాయణ, నాయకులు రాజేశ్వర్‌రెడ్డి, నర్సింహులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

కుస్మసముద్రంలో...

కులకచర్ల : మొక్కలు నాటి పర్యావరణా న్ని పరిరక్షించాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. మండలంలోని కుస్మసముద్రం గ్రామంలో మొక్కలు నాటి నీళ్లుపోశారు. కార్యక్రమంలో ఎంపీపీ సత్యమ్మహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్‌, నాయకులు పాల్గొన్నారు. 

పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో...

పరిగి టౌన్‌ : మండలంలోని ఇబ్రహీంపూర్‌ గ్రామంలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఎంపీపీ కరణం అరవింద్‌రావు, సీఐ లక్ష్మీరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, నాయకులు మొక్కలు నాటా రు. కార్యక్రమంలో ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, శ్రీశైలం, ఉపసర్పంచ్‌ నరేందర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి, మైనార్టీ నాయకుడు ముజఫర్‌, మాజీ సర్పంచ్‌ అనంతయ్య పాల్గొన్నారు.


logo