గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - Jul 01, 2020 , 22:34:42

దేవుడు జన్మనిస్తే.. డాక్టర్లు పునర్జన్మనిస్తారు

దేవుడు జన్మనిస్తే.. డాక్టర్లు పునర్జన్మనిస్తారు

  • ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ 

వికారాబాద్‌ టౌన్‌ : రక్తదానం ఎంతో గొప్పదని, రక్తాన్ని దానం చేయడం వల్ల ఇతరుల ప్రాణాలు కాపాడినవారవుతామని ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ అన్నారు. బుధవారం వికారాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో డాక్టర్స్‌ డే, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ తల్లి ప్రేమమ్మ జన్మదినం సందర్భంగా ‘ఫిట్‌ ఇండియా ఫౌండేషన్‌' ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలని సూచించారు. దేవుడు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మనిస్తారన్నారు. ప్రతిఒక్కరూ డాక్టర్స్‌ డేను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీఐ శ్రీనివాస్‌రావు, టీఆర్‌ఎస్‌ నాయకులు అధిక సంఖ్యలో రక్తదానం చేయడం సంతోషమన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు, నాయకులు పాల్గొన్నారు.

నేడు పరిగి తైబజార్‌ వేలం 

పరిగి టౌన్‌ : పరిగి పట్టణ తైబజార్‌ వేలాన్ని నేడు నిర్వహించనున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తైబజార్‌కు రూ.5 లక్షలు, పశువుల కబేలాకు రూ.50 వేలు డిపాజిట్‌ చెల్లించి వేలంలో పాల్గొనాలని ఆయన సూచించారు. 


logo