ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Jul 01, 2020 , 22:32:41

పేద కుటుంబాలకు అండగా సీఎంఆర్‌ఎఫ్‌

పేద కుటుంబాలకు అండగా సీఎంఆర్‌ఎఫ్‌

పరిగి : సీఎం సహాయ నిధి పేద కుటుంబాలకు అండగా నిలుస్తుందని పరిగి ఎమ్మె ల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. బుధవా రం పరిగిలోని ఆయన నివాసంలో పరిగి, పూడూరు మండలాలకు చెందిన లబ్ధిదారులకు రూ.17.82లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు లను ఎమ్మెల్యే అందజేశారు. కె.తిర్మలయ్య కు రూ.2 లక్షలు, కె.బుచ్చయ్యకు రూ.2లక్షలు, ఎం.నర్సింహకు రూ.2లక్షలు, బి.శివకుమార్‌కు రూ.63వేలు, శ్రీనివాస్‌కు రూ.2లక్షలు, ఎస్‌.కుమార్‌కు రూ.1.50లక్షలు, జె.లక్ష్మికి రూ.10వేలు, డి.రాహుల్‌కు రూ.లక్ష, కె.మల్లేశ్‌కు రూ.50,500, ఎస్‌. తులసికి రూ.18వేలు, నారాయణరెడ్డికి రూ.2లక్షలు, రఫియాబేగంకు రూ. 60వేలు, రాజుకుమార్‌కు రూ.20వేలు, డి.పృథ్వీరాజ్‌కు రూ.60వేలు, కె.రాజుకు రూ.13వేలు, ఇబ్రహీంకు రూ.16వేలు, ఎం.కాల్యకు రూ.29 వేలు, కె.వెంకటేశంకు రూ.1.50లక్షలు, వెంకటలక్ష్మికి రూ.28వేలకు సంబంధించిన చెక్కులు ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ అశోక్‌, ఎంపీపీ కె.అరవిందరావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్యాంసుందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ ఎస్‌.భాస్కర్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ఆర్‌. ఆంజనేయులు, నార్మాక్స్‌ మాజీ డైరెక్టర్‌ బి.ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.  

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు అందజేత

నవాబుపేట : మండలంలోని ఎల్లకొండ గ్రామానికి చెందిన లబ్ధిదారుడికి సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కును ఎమ్మెల్యే కాలె యాదయ్య చించల్‌పేట గ్రామంలో అందజేశారు. ఎల్లకొండ గ్రామానికి చెందిన లోకేశ్‌ భార్య మానస అనారోగ్యంతో ఒక ప్రైవేట్‌ దవాఖానలో చేరింది. అధిక మొత్తంలో ఖర్చు కావడంతో ఆర్థిక సాయం కోసం సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే చొరవతో ప్రభుత్వం రూ.17వేలు  మంజూరు చేసింది. దీంతో కాలె యాదయ్య లబ్ధిదారుడికి చెక్కును అందజేశారు. 


logo