గురువారం 26 నవంబర్ 2020
Vikarabad - Jun 30, 2020 , 23:11:37

రంగారెడ్డి జిల్లాలో 68 మందికి పాజిటివ్‌

రంగారెడ్డి జిల్లాలో 68 మందికి పాజిటివ్‌

  • అర్బన్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో 51
  • కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు,
  • గ్రామీణ ప్రాంతాల్లో 17 మందికి
  • 1527కు చేరుకున్న కేసులు 

 రంగారెడ్డి, నమస్తే తెలంగాణ: జిల్లాలో నేడు మరో 68 మందికి కరోనా పాజిటివ్‌ రాగా.. ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు జిల్లాలో 25 మంది మృతి చెందినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. అర్బన్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో51 ,కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతా ల్లో 17 మందికి పాజిటివ్‌ వచ్చింది. కేసుల సంఖ్య 1527 కు చేరుకుంది. 300 మంది కోలుకోగా.. 1202 యాక్టివ్‌ కేసులున్నాయి. వీరిలో 240 మంది తమ ఇండ్లలో, 152 మంది ప్రైవేట్‌ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 25 మంది మృతి చెందారు. అర్బన్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో 19 మంది, గ్రామీణ జిల్లాకు చెందిన వారు 6గురు చనిపోయారని వెల్లడించారు. జిల్లాలో 428 కంటైన్మెమెంట్‌ జోన్లు ఉన్నాయి. మిగిలిన యాక్టివ్‌ కేసులకు ఆయా ప్రభుత్వ, ప్రైవేట్‌ దవాఖానల్లో వైద్యం అందిస్తున్నారు. బాలాపూర్‌ లో 4, లేమూరు 1, నార్సింగి 7, నర్కుడ 3, శంకర్‌పల్లి 1, యాచారం 1, సరూర్‌నగర్‌ 11, శేరిలింగంపల్లి 25, మైలార్‌దేవరంపల్లి 14, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 1 చొప్పున 68 మందికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. కొద్ది రోజులుగా జిల్లాలో కరోనా పరీక్షలు నిర్వహిస్తుండగా.. 4355 మంది నమూనాలు సేకరించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు.

తుర్కయాంజాల్‌లో కొనసాగుతున్న కరోనా ఉదృతి

హయత్‌నగర్‌: తుర్కయాంజాల్‌ మున్సిపాలిటి పరిధిలో మంగళవారం రాగన్నగూడ ఎవెన్స్‌ కార్నర్‌, కమ్మగూడ భ వానిపురం కాలనీల్లో రెండు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని గ్రామాలకు కరోనా వ్యాపించింది. ఒక్క ఇంజాపూర్‌లోనే 11 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు. మున్సిపాలిటి పరిధిలో ఇప్పటికే 19 కేసులు ఉండగా తాజా కేసులతో సంఖ్య 21కి చేరుకుంది.  కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఇంజాపూర్‌లోని సీఆర్‌పీఎప్‌ కాలనీ, దుర్గానగర్‌, మిధాని కాలనీతో పాటు రాగన్నగూడ, మునగనూర్‌ గ్రామాల్లో అధిక కేసులు నమోదవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కాలనీల్లో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టి కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వివరాలు సేకరించే పనిలో ప డ్డారు. ఆయా ప్రాంతాల్లో అధికారులు సిబ్బందితో బ్లీచింగ్‌ ఫౌడర్‌ చల్లించి, సోడియం హైడ్రో క్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారి చేయిస్తున్నారు. పాజిటివ్‌ కేసులు నమోదైన ఇంటి వద్ద కంటైన్మెంట్‌ ఏర్పాటు చేసి కాలనీల్లోకి బయటి వారు ఎవ రూ రాకుండా లోపలి వారు బయటికి రాకుండా కర్రలను అడ్డుగా పెట్టి కరోనా నివారణకు చర్యలు చేపడుతున్నారు. కాగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

ఆమనగల్లులో 94  మంది శాంపిల్స్‌ సేకరణ

ఆమనగల్లు: ఆమనగల్లు మండలంలో మంగళవారం 94 మంది నుంచి కరోనా పరీక్షల కోసం శాంపిల్స్‌ను వైద్య సి బ్బంది సేకరించారు. మండలంలోని చింతలపల్లి గ్రామాని కి చెందిన బాధితుడితో ప్రైమరీ కాంటాక్టులో ఉన్నవారితోపాటు మున్సిపాలిటీలోని టీఆర్‌ఎస్‌ నాయకుడి కుటుంబ సభ్యుల శాంపిల్స్‌ను వైద్య సిబ్బంది సేకరించారు. అంతేకాకుండా ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ సూచనల మేరకు అయ్యసాగర్‌ మిషన్‌ భగీరథ సంపులో విధులు నిర్వహిస్తున్న సి బ్బంది, కరోనా సోకి హోంక్వారంటైన్‌లో ఉన్న బాధితులతోపాటు సీఐ నర్సింహారెడ్డి, ఎస్సైలు కరోనా పరీక్షలు చే యించుకున్నారు. వీరందరి ఫలితాలను రెండురోజుల్లో వెళ్లడిస్తామన్నారు. మండలంలో కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరి నుంచి శాంపిల్స్‌ను సేకరిస్తామని.. ప్రజలెవరూ ఆం దోళన చెందవద్దని వైద్యులు సూచనలు చేశారు. 

నందివనపర్తిలో 45 ఏండ్ల వ్యక్తికి

 యాచారం: మండలంలోని నందివనపర్తి గ్రామానికి చెందిన 45ఏండ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.బాధితుడిని సోమవారం నగరంలోని గ్లోబల్‌ దవాఖానకు తర లించారు. మెడికల్‌ ఆఫీసర్‌ నాగజ్యోతి గ్రామాన్ని సందర్శించి బాధితుని కుటుంబ సభ్యులను క్వారంటైన్‌ చేశారు. ఏరియాను కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు.