గురువారం 13 ఆగస్టు 2020
Vikarabad - Jun 30, 2020 , 22:52:54

ఏసీబీకి చిక్కిన ఆరోగ్యశ్రీ సీఓ

ఏసీబీకి చిక్కిన ఆరోగ్యశ్రీ సీఓ

  •  రెన్యువల్‌కు డబ్బులు డిమాండ్‌ 
  • ఫిర్యాదుతో కదిలిన అధికారులు..ఇంటిలోనూ  సోదాలు

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : జిల్లా కలెక్టరేట్‌ ఏసీబీ సోదాలతో ఉలిక్కిపడింది. ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ కో-ఆర్డినేటర్‌ రఘునాథ్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. సిద్దిపేటకు చెందిన ఓ ప్రైవేట్‌ దవాఖానలో ఆరోగ్యశ్రీ రెన్యువల్‌ విషయంలో డబ్బులు డిమాండ్‌ చేయడంతో వారు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం వెనుక భాగంలో ఉన్న కో-ఆర్డినేటర్‌ కార్యాలయంపై దాడులు నిర్వహించి రఘునాథ్‌ రూ.25వేలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. రఘునాథ్‌ కార్యాలయంతో పాటు ఇంటిలో కూడా సోదాలు నిర్వహించారు. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం కోనాపురం గ్రామానికి చెందిన రఘునాథ్‌ గత కొన్నాళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నాడు. రంగారెడ్డితో పాటు ఉమ్మడి మెదక్‌కు కూడా  ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్నాడు. logo