సోమవారం 06 జూలై 2020
Vikarabad - Jun 30, 2020 , 01:15:19

వికారాబాద్‌ అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేస్తాం

వికారాబాద్‌ అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేస్తాం

  • జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కొండల్‌ రెడ్డి 

వికారాబాద్‌ : బంగారు తెలంగాణ వైపు అడుగులు వేస్తున్న సీఎం కేసీఆర్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అడుగుజాడల్లో నడుస్తూ వికారాబాద్‌ అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కొండల్‌ రెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొండల్‌రెడ్డి మాట్లాడుతూ వికారాబాద్‌ టీఆర్‌ఎస్‌ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, ఎమ్మెల్యేపై అసంతృప్తి ఉందంటూ ఓ పత్రికలో వచ్చిన కథనానికి స్పందిస్తూ కొందరు విబేధాలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మేము ఎల్లప్పుడూ సీఎం కేసీఆర్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అడుగుజాడల్లో నడుస్తూ బంగారు తెలంగాణకు మా వంతు సహకారం అందిస్తామని తెలిపారు. టీఆర్‌ఎస్‌ నాయకులు హఫీజ్‌, శుభప్రద్‌, చిగుళ్లపల్లి రమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ వికారాబాద్‌ టీఆర్‌ఎస్‌ పార్టీలో నాయకులంతా కలిసికట్టుగా పనిచేస్తున్నారని, వికారాబాద్‌ అభివృద్ధికి ఎమ్మెల్యే ఆనంద్‌తో కలిసి పనిచేసేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు అనంత్‌రెడ్డి, నర్సింహులు, ముత్తార్‌ షరీఫ్‌, నవీన్‌కుమార్‌, విజయ్‌కుమార్‌, ముత్యంరెడ్డి పాల్గొన్నారు.


logo