ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Jun 30, 2020 , 00:08:50

అడ్మిషన్లు, ఆన్‌లైన్‌ క్లాసులకు అనుమతి లేదు

అడ్మిషన్లు, ఆన్‌లైన్‌ క్లాసులకు అనుమతి లేదు

  • పాఠశాలలు ప్రారంభించినా, ఫీజులు వసూలు చేసినా కఠిన చర్యలు: డీఈవో రేణుకాదేవి

వికారాబాద్‌ : జిల్లాలో ప్రైవేటు పాఠశాలలను అనుమతిలేకుండా పునఃప్రారంభిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖాధికారి రేణుకాదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా నేపథ్యంలో 2020-21 విద్యా సంవత్సరానికిగాను పాఠశాల పునఃప్రారంభ తేదీని ప్రభుత్వం ఇంకా ప్రకటించనందున జిల్లాలో  పాఠశాలలను పునఃప్రారంభించరాదని ఆమె తెలిపారు. అదేవిధంగా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించరాదని, విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయరాదని సూచించారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలను ప్రారంభించినా, ఫీజులు వసూలు చేసినా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రేణుకాదేవి వెల్లడించారు.  logo