బుధవారం 12 ఆగస్టు 2020
Vikarabad - Jun 30, 2020 , 00:04:41

ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి..

ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి..

  • ఉద్యమస్ఫూర్తితో హరితహారం  
  • చెక్‌డ్యాంల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరుగుతాయి  
  • విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి 
  • వికారాబాద్‌లో నిత్యావసర సరుకులు పంపిణీ 
  • ధారూరు మండలంలో మొక్కలు నాటి, చెక్‌ డ్యాం పనులకు శంకుస్థాపన 
  • పాల్గొన్న ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, రోహిత్‌రెడ్డి

వికారాబాద్‌/ధారూరు : భూగర్భ జలాలు పెంచేందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెక్‌డ్యాంల నిర్మాణ పనులు చేపడుతున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇంటర్‌ ఫలితాల్లో జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వికాస్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థులను మంత్రి సబితాఇంద్రారెడ్డి సన్మానించారు. అనంతరం ఆరో విడుత హరితహారంలో భాగంగా ధారూరు మండల పరిధిలోని కెరెళ్లి, రుద్రారం, గట్టెపల్లి గ్రామాల్లో వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు.

గట్టెపల్లి గ్రామ సమీపంలో రూ.3కోట్ల50లక్షలతో చెక్‌డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చెక్‌డ్యాంల నిర్మాణంతో పంటలు బాగా పండి అధిక దిగుబడులు వస్తాయన్నారు. హరితహారంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అనంతరం వికారాబాద్‌ రామయ్యగూడ కాలనీలోని ఏజీ చర్చిలో ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని పేదలకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కొండల్‌రెడ్డి, ధారూరు ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ సుజాత, పీఏసీఎస్‌ చైర్మన్‌ సత్యనారాయణరెడ్డి, వైస్‌ చైర్మన్‌ రాజునాయక్‌, ఎంపీడీవో అమృత, తహసీల్దార్‌ భీమయ్యగౌడ్‌, వైస్‌ ఎంపీపీ విజయ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు. logo