ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Jun 25, 2020 , 23:04:54

వికారాబాద్‌లో ఐదు పాజిటివ్‌ కేసులు

 వికారాబాద్‌లో ఐదు పాజిటివ్‌ కేసులు

వికారాబాద్‌: వికారాబాద్‌ జిల్లాలో కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి సంఖ్య 60కి చేరింది. గురువారం జిల్లా కేంద్రంలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. వీరిలో ఒకే కుటుంబం నుంచి ముగ్గు రు ఉండగా, వారం రోజుల క్రితం పాజిటివ్‌ వచ్చిన కుటుంబంలో ఒకరు, 35 ఏండ్ల మరొక వ్యక్తికి మొత్తంగా ఐదుగురికి పాజిటివ్‌గా జిల్లా వైద్య అధికారులు నిర్ధారించారు. జిల్లాలో 69 మంది హోం క్వారంటైన్‌లో ఉండగా,  33 మంది శాంపిల్స్‌ ఫలితాలు రావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.

  సింగాపురంలో ఒకరికి పాజిటివ్‌

 శంకర్‌పల్లి రూరల్‌: శంకర్‌పల్లి మున్సిపల్‌ పరిధిలోని సింగాపురంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతడి కుటుంబాన్ని శంకర్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది హోం క్వారంటైన్‌లో ఉంచారు. ఆయనతో పాటు కుటుంబసభ్యులు నలుగురిని, చుట్టుపక్కల వారిని కూడా హోం క్వారంటైన్‌ చేశారు. కాగా ఆయన మెహిదీపట్నం పరిధిలోని ఓ పోలీస్‌ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. 


logo