శనివారం 08 ఆగస్టు 2020
Vikarabad - Jun 25, 2020 , 01:45:40

పల్లె ప్రకృతి వనాలకు స్థలాలు సిద్ధం

పల్లె ప్రకృతి వనాలకు స్థలాలు సిద్ధం

వికారాబాద్‌ రూరల్‌ : గ్రామాల్లో పల్లె ప్రకృతి వ నాలకు ప్రభుత్వ స్థలాల ను గుర్తించి సిద్ధం చేస్తున్నట్లు ఎంపీవో నాగరాజు తెలిపారు. బుధవారం మండలంలోని నారాయణ్‌పూర్‌లో పల్లె ప్రకృతి స్థలాలను గుర్తించి ఉపాధి కూలీలతో పిచ్చిమొక్కల ను తొలగింపజేశారు. మండలంలోని 21 గ్రామాల్లో కొటాలగూడ, సిద్దులూరు తప్ప మిగతా 19 గ్రామాల్లో స్థలాలను గుర్తించి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గురువారం నుంచి ప్రారంభమయ్యే హరితహారంలో మండలంలో 2 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన తెలిపారు. నాటిన ప్రతి మొక్కనూ కాపాడుకునేలా ముందుగానే సర్పంచ్‌లకు, గ్రామ కార్యదర్శులకు అవగాహన కల్పించామన్నారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి వెంకటేశం, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. logo