సోమవారం 26 అక్టోబర్ 2020
Vikarabad - Jun 25, 2020 , 01:24:44

హరితహారానికి శ్రీకారం

హరితహారానికి శ్రీకారం

  • నేటి నుంచి  ఆరో విడుత హరితహారం
  • మహేశ్వరం, పరిగిలో ప్రారంభించనున్న మంత్రి  సబితారెడ్డి
  • ఆయా నియోజకవర్గాల్లో పాల్గొననున్న ప్రజాప్రతినిధులు
  • ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
  • నాటడానికి మొక్కలు, గుంతలు సిద్ధం
  • ఈ ఏడాది రంగారెడ్డి జిల్లా లక్ష్యం 57.90 లక్షల మొక్కలు
  • వికారాబాద్‌ జిల్లా లక్ష్యం 68.71 లక్షలు
  • మొదటి రోజు లక్ష మొక్కలు నాటేందుకు సన్నాహాలు 

 పల్లెలు, పట్ణణాల్లో హరిత వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రతిసారిలాగే ఈ యేడు హరితహారాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమాయత్తమయ్యారు. నేడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం వేమూరు,  పరిగి మండలం మిట్టకోడూర్‌ అటవీ ప్రాంతంలో మొక్కలు నాటి హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ  ఏడాది రంగారెడ్డి జిల్లాలో కనీసం 57.90 లక్షల మొక్కలు  నాటాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం ముందుకెళ్తున్నది. వికారాబాద్‌ జిల్లాలో 68.71 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గురువారం ఒక్కరోజే లక్ష మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. అందుకోసం ఇప్పటికే ఖాళీ స్థలాల్లో గుంతలు తవ్వారు. ఆయా శాఖలవారీగా లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. మొక్కలను నాటడమే కాకుండా ప్రతి మొక్కనూ బతికించుకునేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ పనితీరు  కనబర్చిన అధికారులకు ప్రత్యేక పురస్కారాలు అందిస్తామని మంత్రి  ప్రకటించడంతో       అధికా రులు మరింత ఉత్సాహంతో పనిచేస్తున్నారు.  

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ: ఆరో విడుత హరితహారం రంగారెడ్డి జిల్లాలో నేడు అట్టహాసంగా ప్రారంభం కానుంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలో మొక్కలు నాటుతారు. ఎమ్మెల్యేలు వారివారి నియోజకవర్గాల్లో మొక్కలు నాటేందుకు శ్రీకారం చుడుతారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి కందుకూరు మండలం వేమూరు గ్రామంలో హరితహారాన్ని ప్రారంభిస్తారు. శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లోని ఆయా మండల కేంద్రాల్లో ప్రారంభిస్తారు. ప్రస్తుతం హరితహారంలో కనీసం 57.90 లక్షల మొక్కలు నాటాలని జిల్లా యంత్రాం గం లక్ష్యాన్ని నిర్దేశించింది. అటవీ శాఖ, గ్రామీణాభివృద్ధి, జిల్లా పంచాయతీ, మున్సిపల్‌ తదితర శాఖల విభాగాలు సంయుక్తంగా పెద్దఎత్తున పాల్గొనే ఈ హరితహారంలో లక్ష్యాన్ని మించి మొక్కలు నాటాలని నిర్ణయించారు.

జిల్లాలోని 560 పంచాయతీల్లో గ్రామానికొకటి చొప్పున 560 నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు. ఈ నర్సరీల్లో 52లక్షల మొక్కలను పెంచుతున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, జిల్లా పం చాయతీ శాఖ ఆధ్వర్యంలో 34లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లా వైశాల్యం 7.5లక్షల హెక్టార్లు ఉండగా.. 2.16లక్షల హెక్టార్ల పచ్చదనం ఉండాలి. ప్రస్తుతం 29,489 హెక్టార్లలో హరితదనం ఉన్నది. ఎకరం విస్తీర్ణంలో.. ప్రతి గ్రామంలో కనీసం ఒక ఎకరం విస్తీర్ణంలో ప్రత్యేక ప్రకృతి వనం పెంచాలని కూడా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. యాదాద్రి మోడల్‌లో ప్రతి గ్రామం, మున్సిపాలిటీలో అడవులు పెంచాలని తెలిపారు. లక్ష్యానికి మించి మొక్కలు నాటడంతో రంగారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే ముందంజలో ఉంచేందుకు ప్రయత్నించాలని మంత్రి సబితారెడ్డి ఇప్పటికే అధికారులకు సూచించారు.

జిల్లాలో అటవీశాఖ ద్వారా 34లక్షల మొక్కలను పెంచింది. దీంతో పాటు జిల్లాలోని 560 పంచాయతీల్లో నర్సరీల ద్వారా 52 లక్షల మొక్కలు పెంచారు. జిల్లాలో అటవీ శాఖ ద్వారా 8లక్షల మొక్కలు, పంచాయతీరాజ్‌, డీఆర్‌డీవో ద్వారా 34లక్షలు, 9లక్షల మొక్కలను మున్సిపాలిటీలలో నాటాలని ప్రణాళికలు రూపొందించారు. జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో, కాలనీ లే అవుట్‌ ఓపెన్‌ ప్లేస్‌లలో మొక్కలు పెద్దఎత్తున నాటేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి ఇంటికి కనీసం 5 మొక్కలను అందజేసి అవి బతికేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాం తాల్లో కోతుల బెడద తీరేలా ఫలాలను ఇచ్చే చెట్లను విరివిగా పెంచేందుకు కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఎక్కడైనా కనీసం 500 గజాల ఖాళీ స్థలం ఉంటే పది వేల మియావాకీ మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ సంస్థలను ఆదేశించారు. హరితహారంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు ప్రత్యేక పురస్కారాలను అందిస్తామని మంత్రి ఇప్పటికే ప్రకటించారు. వివిధ రకాల మొక్కలు ఇవే.. జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీలలో జా మ, అల్లనేరేడు, సీతాఫలం, మారేడు, పనస, సీమ చింత, చిం త, ఉసిరి, రావి, మర్రి, మేడి, వెలగ తదితర మొక్కలు ఉన్నా యి. జిల్లాలో మొత్తం 560 పంచాయతీలలో నర్సరీల ద్వారా 52లక్షల మొక్కలను పెంచారు. వేప, చింత, కానుగ, టేకు, దానిమ్మ, జామ, నేరేడు, తులసి, గోరింటాకు, గులాబీ, గన్నేరు, మునగ తదితర మొక్కలు ఈ జాబితాల్లో ఉన్నాయి.

వీటిలో కనీసం రెండు లేదా మూడు ఫీట్లు ఉన్న మొక్కలనే నాటుతారు. నేడు వేమూరు రిజర్వు ఫారెస్ట్‌ బ్లాక్‌లో ప్రారంభం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి కందుకూరు మండలం వేమూరు గ్రామంలోని రిజర్వు ఫారెస్ట్‌ బ్లాక్‌లో ప్రారంభిస్తారు. గురువారం ఉదయం 8.30 గంటలకు వేమూరులో మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రితోపాటు పెద్దఎత్తున అధికారులు, స్థానికులు పాల్గొంటారు.

జిల్లాలోని చేవెళ్ల, ఎల్బీనగర్‌, మహేశ్వరం, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, కల్వకుర్తి, షాద్‌నగర్‌ తదితర నియోజకవర్గాల్లో స్థానిక శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, అధికారులు ఎక్కడికక్కడ పాల్గొంటారు. ఒక్కరోజు లక్ష మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం నేటి నుంచి షురూ కానున్నది. నేడు పరిగి మండలంలోని మిట్టకోడూర్‌ అటవీ ప్రాంతంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మిట్టకోడూర్‌ అటవీ ప్రాంతంలో 5 వేల మొక్కలు నాటేందుకు అటవీ శాఖ అధికారులు అంతా సిద్ధం చేశారు. మరోవైపు ఒక్కరోజు జిల్లా అంతటా లక్ష మొక్కలు నాటేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రామస్థాయి నుంచి మండల కేంద్రాల్లో, మున్సిపాలిటీల్లో, జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటనున్నారు.

కోట్‌పల్లి మండలంలోని సుల్తాన్‌పూర్‌లో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పి.సునీతామహేందర్‌ రెడ్డి, ఆయా నియోజకవర్గాలో ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌ రెడ్డి, పైలట్‌ రోహిత్‌రెడ్డి, ఆనంద్‌, మహేశ్‌రెడ్డి హరితహారం పండుగలో పాల్గొని మొక్కలు నాటనున్నారు. ఇప్పటివరకు 6.25 లక్షల గుంతలు తీసే ప్రక్రియ పూర్తికాగా, జిల్లాలోని 566 నర్సరీల్లో 41.38 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది లక్ష్యం 68.71 లక్షలు... ఈ ఏడాది 68.71 లక్షల మొక్కలను నాటాలని జిల్లా యం త్రాంగం లక్ష్యంగా నిర్దేశించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈ ఏడాది రోడ్లకు ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్క లు నాటనున్నారు.

అయితే గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా హరితహారం కార్యక్రమంలో అన్ని శాఖలను భాగస్వాములను చేసేలా ఆయా శాఖల వారీగా నాటాల్సిన మొక్కల లక్ష్యాలను అటవీ శాఖ అధికారులు సిద్ధం చేశారు. అదేవిధంగా మొక్కలను నాటిన అనంతరం విస్మరించడం కాకుండా ప్రతి మొక్కనూ బతికించేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది.

పంచాయతీలో నీటి నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేసి మొక్కలకు నీరందించేలా ఏర్పాట్లు చేశారు. పూలు, పండ్ల మొక్కలకు ప్రాధాన్యత ఈ ఏడాది ప్రధానంగా టేకు, ఉసిరి, జామ, నిమ్మ, సీతాఫల్‌, దానిమ్మ, బొప్పాయి, మునగ, గులాబీ, మందారం, మల్లె, కానుగ, నెమలినార, శ్రీగంధం తదితర మొక్కలను నాటనున్నారు. అయితే పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామ పం చాయతీల్లో ఏయే మొక్కలను నాటాలనే దానిపై చేసిన తీర్మా నం ప్రకారం సంబంధిత మొక్కలను గ్రామాల్లోని నర్సరీల్లో పెంచారు. ప్రతి గ్రామాన్ని హరితవనంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఏడాది అటవీ ప్రాంతాల్లోని 250 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు జిల్లా అటవీ శాఖ అధికారులు సన్నద్ధమయ్యారు. జిల్లాలోని ధారూరు, తాండూరు, అన్నాసాగర్‌, తట్టేపల్లి, కల్కోడ, వికారాబాద్‌, బొంరాస్‌పేట్‌, జిన్‌గుర్తి, గుడుపల్లి, కొత్తపల్లి, మిట్టకోడూర్‌, అడికిచెర్ల, నాగసముందర్‌, రంగంపల్లి అటవీ ప్రాంతాల్లో, టేకు, చైనా బాదాం, కానుగ, నెమలి నార, మర్రి, చింత, జువ్వి, ఇప్ప, నారవేప, ఎర్రచందనం, శ్రీగంధం, వేప, మద్ది, సీతాఫల్‌, ఉసిరి మొక్కలను నాటనున్నారు. అంతేకాకుండా అటవీ ప్రాంతాల్లో 130 కిలోమీటర్ల మేర తీసిన కందకాల మీద గచ్చకాయ మొక్కలు నాటనున్నారు.

గుంతలు పరిశీలించిన కలెక్టర్‌ 

పరిగి: మండలంలోని సాలిప్పలబాటతండా పంచాయతీలోని అటవీ భూమిలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మొక్కలు నాటనున్న స్థలాన్ని కలెక్టర్‌ పౌసుమి బసు బుధవారం పరిశీలించారు. 50 హెక్టార్ల స్థలంలో 35 వేల మొక్కల పెంపకం లక్ష్యంగా నిర్దేశించుకున్న అటవీ శాఖ అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు చేపట్టారు. ఎన్ని మొక్కలు నాటుతారు, సంరక్షణ చర్యలను ఏవిధంగా చేపట్టారు, తదితర విషయాలను జిల్లా అటవీ శాఖాధికారి వేణుమాధవ్‌ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, అటవీ శాఖ రేంజర్‌ అబ్దుల్‌ హాయ్‌  పాల్గొన్నారు. 

logo