మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - Jun 22, 2020 , 23:44:35

నకిలీ విత్తనాలతో మోసపోవద్దు

నకిలీ విత్తనాలతో మోసపోవద్దు

వికారాబాద్‌: రైతులు నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దని, గుర్తిం పు పొందిన దుకాణాలలో మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామాల్లో అనుమతులు లేని వ్యక్తులు వచ్చి విత్తనాలు అమ్మడం లేదా రైతుల వద్ద కొనడం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. అలాంటివారి వివరాలను మీ సమీపంలోని వ్యవసాయ అధికారులకు తెలియజేయాలని ఆయన సూచించారు. గుర్తింపు ఉన్న దుకాణాలలోనే ధ్రువీకరించిన విత్తనాలను కొనుగోలు చేయాలని తప్పనిసరిగా రశీదు పొందాలని సూచించారు. తీసుకున్న రశీదును పంటకాలం ముగిసే వరకు రైతులు తమ వద్దనే ఉంచుకోవాలన్నారు. 


logo