బుధవారం 12 ఆగస్టు 2020
Vikarabad - Jun 22, 2020 , 23:43:16

టెన్త్‌ గ్రేడ్‌లు వచ్చేశాయి

టెన్త్‌ గ్రేడ్‌లు వచ్చేశాయి

వికారాబాద్‌ : పదో తరగతి విద్యార్థుల పాస్‌ మెమోలను సంబంధిత పాఠశాలలో  పొందవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని, ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని సీఎం కేసీఆర్‌, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో 13764మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ మార్కుల ప్రాతిపధికన కేటాయించిన గ్రేడుల వివరాలను www.bse.telangana.gov.in వెబ్‌ సైట్‌ పొందుపర్చి నట్లు తెలిపారు. పాస్‌ మెమోలను సంబంధిత పాఠశాల ప్రధానోప్యాధాయుల వద్ద పొందవచ్చన్నారు. 

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/షాబాద్‌ 

 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదవ తర గతి ఫలితాలు విడుదలైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి విజయలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.  జిల్లాలో మొత్తం 47,147మంది విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులైనట్లు చెప్పారు.


logo