బుధవారం 05 ఆగస్టు 2020
Vikarabad - Jun 22, 2020 , 23:40:51

ఔషధ మొక్కలకు అధిక ప్రాధాన్యం కల్పించాలి కలెక్టర్‌ పౌసుమి బసు

ఔషధ మొక్కలకు అధిక ప్రాధాన్యం కల్పించాలి కలెక్టర్‌ పౌసుమి బసు

వికారాబాద్‌ రూరల్‌ : అనంతగిరి అటవీ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలని కలెక్టర్‌ పౌసుమి బసు అన్నారు. సోమవారం వికారాబాద్‌ అనంతగిరి అటవీ ప్రాంతంలో జిల్లా అటవీశాఖ అధికారి వేణుమాధవరావుతో కలి సి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో 25ఎకరాల్లో నాటిన మొక్కలు బాగున్నాయన్నారు. ఈసారి కూడా వికారాబాద్‌ మున్సిపల్‌కు సంబంధించి నాలుగు లక్షల లక్ష్యాన్ని చేరుకునేందుకు అనంతగిరి అటవీ ప్రాంతంలోని ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు పెంచాలన్నారు. అనంతగిరి అటవీ ప్రాంతంలో పులుమద్ది, మున్నూరు సోమారం గ్రామాలు రిజర్వు ఫారెస్టులో ఉన్నాయి కాబట్టి అర్బన్‌ పార్కును మరింత అభివృద్ధి చేయాలన్నారు. ఔషధ మొక్కలు పెంచే అవకాశం ఉంటే వాటిని నాటాలని అటవీశాఖ అధికారులకు సూచించారు. ఏ భూముల్లో ఏ మొక్క నాటితే ఏపుగా పెరిగే అవకాశం ఉంటుందో వాటినే నాటాలని అధికారులకు సూచించారు. 

మోడల్‌ గ్రామంగా పుల్‌మద్దిని అభివృద్ధి చేయాలి

మండలంలోని పుల్‌మద్ది గ్రామాన్ని మోడల్‌గా అభివృద్ధి చేసేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అన్నారు. గ్రామంలోని డంపింగ్‌ యార్డు, గతంలో నాటిన మొక్కలను పరిశీలించారు. రెవెన్యూ ప్లాంటేషన్‌ మరింతగా పెంచాలన్నారు. పార్కు ఏర్పాటుకు కావల్సిన ప్రభుత్వ స్థలాన్ని సర్వే చేసి అం దించాలని వీఆర్వో భీమన్నకు సూచించారు. పార్కులో రకరకాల మొక్కలు నాటాలని సర్పంచ్‌ మాధవరెడ్డికి వివరించారు. డంపింగ్‌ యార్డును త్వరలో అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుభాషిణి, ఎంపీవో నాగరాజు, ఏపీవో శ్రీనివాస్‌, అధికారులు ఉన్నారు. 

వంతెనలను త్వరగా పూర్తి చేయాలి

మోమిన్‌పేట్‌ : నిర్మాణంలో ఉన్న వంతెనలను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్‌ పౌసుమి బసు అన్నారు. మోమిన్‌పేట్‌ నుంచి శంకర్‌పల్లి వెళ్లే రహదారిలో నిలిపివేసిన మోమిన్‌పేట్‌, దేవరంపల్లి, చీమలదరి వంతెనల పనులను పరిశీలించారు. ఎందుకు పనులు నిలిపివేశారని అధికారులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడేండ్ల కితం ప్రారంభమైన వంతెనల పనులు నత్తనడకన ఎందుకు కొనసాగుతున్నాయని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వంతెనల పనులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. వర్షాకాలం ప్రారంభం కా వడంతో వర్షాలకు వరదలోచ్చి తాత్కాలిక రోడ్లు కొట్టుకుపోకుండా, రహదారులకు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమం లో ఆర్‌ఎన్‌డీ ఆధికారులు డీఈ వెంకటేశం, ఏఈ రవికుమార్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


logo