శనివారం 15 ఆగస్టు 2020
Vikarabad - Jun 21, 2020 , 22:50:38

పరిసరాల పరిశుభ్రత పట్ల శ్రద్ధ వహించాలి

పరిసరాల పరిశుభ్రత పట్ల శ్రద్ధ వహించాలి

 కొడంగల్‌ :  మంత్రి కేటీఆర్‌ పిలుపు వేరకు ప్రతి ఆదివారం పది గంటల పది నిమిషాల కార్యక్రమంలో కొడంగల్‌ ఎమ్మె ల్యే పట్నం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో పూల కుండీల్లో నిలిచిన నీటిని, చెత్తాచెదారాన్ని తొలిగించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. పట్టణంలోని రెండో వార్డు కౌన్సిలర్‌ మధుసూదన్‌ యాదవ్‌ తన ఇంటి ఆవరణలో పరిసరాలను శుభ్రం చేసి మొక్కలు నాటారు. 

నందిగామ:  ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఈట గణేశ్‌ అన్నారు. మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు 10గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో భాగంగా జడ్పీ వైస్‌ చైర్మన్‌ తన ఇంటి ఆవరణలో ఉన్న కలుపు మొక్కలను తొలగించారు. 

 తాండూరు టౌన్‌: ముందు జాగ్రత్తలు పాటించడం వల్ల వర్షాకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధులను నియంత్రించవచ్చని తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న అన్నారు. మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ఆమె తన నివాసంలో పరిశుభ్రత పనులు చేపట్టారు. 

 శంకర్‌పల్లి రూరల్‌: పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని పత్తేపురం కౌన్సిలర్‌ రాములు పేర్కొన్నారు. వర్షాలకు పత్తేపురం వార్డులోని రోడ్డు పూర్తిగా బురదమయంగా మారడంతో ఆదివారం మట్టిని పోయించారు.

 శంకర్‌పల్లి: ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని శంకర్‌పల్లి మున్సిపల్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మ న్‌ బీ.వెంకట్‌రాంరెడ్డి అన్నారు. ప్రతీ ఆదివారం 10 నిముషాలు తమ ఇంటిని, పరిసరాలను శుభ్రంగా చేసుకోవాలన్న మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు ఆయన తన ఇంటి పెరటిలోని పరిసరాలను శుభ్రం చేశారు.

 షాబాద్‌: గ్రామంలో ఎవరి పరిసరాలను వారు పరిశుభ్రం గా ఉంచుకున్నప్పుడే రోగాలు దరిచేరవని హైతాబాద్‌ గ్రామ సర్పంచ్‌ కావలి మల్లేశ్‌ అన్నారు. ఆదివారం షాబాద్‌ మండ ల పరిధిలోని హైతాబాద్‌ గ్రామంలో మండల కో-ఆప్షన్‌ సభ్యుడు ఏండీ చాంద్‌పాషాతో కలిసి వ్యాధుల నివారణకు హైడ్రోక్లోరైట్‌ రసాయానాన్ని పిచికారీ చేయించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ గోపాల్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు కొండ రాజుగౌడ్‌, సురేశ్‌గౌడ్‌ పాల్గొన్నారు. 


logo