మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - Jun 21, 2020 , 22:45:28

జయశంకర్‌ సార్‌ జీవితమే ఒక ఉద్యమం

జయశంకర్‌ సార్‌ జీవితమే ఒక ఉద్యమం

  • ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌

వికారాబాద్‌ : తెలంగాణ ప్రజల గుండెల్లో చెరుగని ము ద్ర వేసిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ భవిష్యత్తు తరాలకు మార్గ నిర్దేశకులని, జయశంకర్‌ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్‌ బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటులు వేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ అన్నారు. ఆదివారం పట్టణంలో జయశంకర్‌ సార్‌ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ జయశంకర్‌ సార్‌ తెలంగాణ రాష్ట్ర సాధనే ఆశగా, శ్వాసగా జీవించారని పేర్కొన్నారు. జయశంకర్‌ సార్‌ జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికే ధారపోసిన ఆయన ఆశయం స్ఫూర్తిదాయకమన్నారు. యువత జయశంకర్‌ స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. జయశంకర్‌ సార్‌ కలలు కన్నట్టు తెలంగాణను సీఎం కేసీఆర్‌ తీర్చిదిద్దుతున్నారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ ముత్యంరెడ్డి, కౌన్సిలర్లు అనంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. 

ఆశయ సాధన కోసం కృషి చేయాలి

కోట్‌పల్లి : తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుపొందిన జయశంకర్‌ సార్‌ వర్ధంతి వేడుకలను మండలంలో టీఆర్‌ఎస్‌ నాయకుల ఆధ్వర్యంలో చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జయశంకర్‌ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేశారని, ఆయన ఆశయ సాధన కోసం ఆడుగుజాడలో యువత నడుచుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఉద్యమకారులు పతంగే పాండు, ఉప్పరి మహేందర్‌, పార్టీ మాజీ మండల అధ్యక్షుడు లింగయ్య, మత్స్యుశాఖ సభ్యుడు అనంద్‌, నాయకులు హరి, కిష్టయ్య, సాంభశివ, నర్సింహారెడ్డి పాల్గొన్నారు. 

యువత ఆయన అడుగుజాడలో నడువాలి

మర్పల్లి : జయశంకర్‌ సార్‌ చిరస్మరణీయుడని జడ్పీటీసీ మధుకర్‌, డీసీసీబీ డైరెక్టర్‌ ప్రవీణ్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మార్కెట్‌ కార్యాలయ ఆవరణలో జయశంకర్‌ సార్‌ వర్ధంతిని పురస్కరించొని ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి కృషి చేసిన వ్యక్తి జయశంకర్‌ సార్‌ అని, ప్రజలందురూ  గుర్తుంచుకునే మహోన్నత వ్యక్తి అని అన్నారు. యువత ఆయన అడుగుజాడలో నడువాలని సూచించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ మోహన్‌రెడ్డి, మండల కో-ఆప్షన్‌ సభ్యుడు సోహెల్‌, ఎంపీటీసీ రవీందర్‌, పార్టీ గ్రామాధ్యక్షుడు గఫార్‌, నాయకులు పాల్గొన్నారు.logo