బుధవారం 12 ఆగస్టు 2020
Vikarabad - Jun 21, 2020 , 22:41:27

‘పది గంటలకు’ అంతా పరిశుభ్రం

‘పది గంటలకు’ అంతా పరిశుభ్రం

  •   వ్యాధుల నివారణకు చర్యలు
  •   డాక్టర్‌ మెతుకు ఆనంద్‌

వికారాబాద్‌ : ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాల పాటు సమయాన్ని కేటాయిస్తే వర్షాకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధులను అరికట్టవచ్చని ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ అన్నారు. ఆదివారం పట్టణంలోని గ్రంథాలయ సంస్థ కార్యాలయం ఎదుటగా ఉన్న ఖాళీ స్థలంలో పిచ్చిమొక్కలను పారిశుద్ధ్య సిబ్బందితో తొలిగించారు. తొట్టిలోని నీటిలో ఆయిల్‌ బాల్స్‌ వేసి శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన జీవనానికి పరిశుభ్రత, పచ్చదనం అవసరమని పేర్కొన్నారు. ప్రతి ఒక్క రూ శుభ్రత పాటించాలని కోరారు.  దోమ కాటు వల్ల మలేరియా, టైఫాయిడ్‌, డెంగీ, మెదడు వాపు లాంటి ప్రమాదకర వ్యాధులు వ్యాపిస్తాయని వివరించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇండ్లలోని నీటి తొట్టిలు, డ్రమ్‌లు, బిందెలను ఎండలో ఆరబెట్టాలన్నారు. నీరు నిల్వ ఉన్న చోట తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి ఆదివారం పది గంటలకు కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ ముత్యంరెడ్డి, కౌన్సిలర్‌ అనంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, ఎంపీడీవో సత్తయ్య, శానిటేషన్‌ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.


logo