శుక్రవారం 07 ఆగస్టు 2020
Vikarabad - Jun 21, 2020 , 22:35:29

తెరుచుకున్న ఆలయాలు..

తెరుచుకున్న ఆలయాలు..

వికారాబాద్‌ రూరల్‌ : సంపూర్ణ సూర్యగ్రహణం అనంతరం అనంతపద్మనాభస్వామి ఆలయం, బుగ్గరామలింగేశ్వరాలయం, వేంకటేశ్వరస్వామి ఆలయాలను శుద్ధి చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు సాయంత్రం సమయంలో వెళ్లి దర్శనాలు చేసుకున్నారు. సూర్యగ్రహణం ప్రత్యేక గురించి భక్తులకు పూజారులు వివరించారు. 

ఆలయాల్లో శుద్ధి

పరిగి : సంపూర్ణ సూర్యగ్రహణం అనంతరం పరిగి పట్టణంలోని దేవాలయాలన్నీ శుద్ధి చేశారు. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు సూర్యగ్రహణం అనంతరం పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం, శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవాలయం, కన్యకాపరమేశ్వరి దేవాలయం, శ్రీ సీతారాముల వారి ఆలయం, హనుమాన్‌ ఆలయాలన్నింటినీ శుద్ధి చేశారు. ఆలయాల ఆవరణలు సైతం శుభ్రం చేసి పూజలు నిర్వహించారు. 

పాంబండ దేవాయంలో ప్రత్యేక పూజలు

కులకచర్ల: కులకచర్ల మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఉన్న దేవాలయాలు సూర్యగ్రహణం అనంతరం శుద్ధి చేసి ప్రత్యేకపూజలు నిర్వహించారు. మండల పరిధిలోని శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయంలో సూర్యగ్రహణం తర్వాత పూజారులు దేవాలయాన్ని శుద్ధిచేసి స్వామివారికి వివిధ రకాలుగా అభిషేకం నిర్వహించారు. శ్రీ రామలింగేశ్వరస్వామికి దేవాలయంలో పూజారి పాండు ఆధ్వర్యంలో ప్రత్యేకపూజలు చేశారు. 

కనివిందుగా గ్రహణం 

షాద్‌నగర్‌టౌన్‌: ఆకాశంలో సూర్యగ్రహణం ఆదివారం అద్భుతంగా కనిపించింది. ఉదయం 10: 16నిమిషాలకు ప్రారంభమైన సూర్యగ్రహణాన్ని  వీక్షించేందుకు షాద్‌నగర్‌ పట్టణంలోని చిన్నారులు, పెద్దలు ఆసక్తి కనబరిచారు. ప్రారంభమైనప్పటి నుంచి కనివిందు చేసిన సూర్యగ్రహణం మధ్యాహ్నం 12:15నిమిషాల తర్వత సూర్యుడిని మేఘాలు కమ్ముకోవడంతో సూర్యగ్రహణం కనిపించలేదు. అదేవిధంగా మండలంలోని శ్రీ రామలింగేశ్వర, అంబ భవానీ, పట్టణంలోని వేంకటేశ్వర, శివమారుతిగీతా అయ్యప్ప మందిరం, చౌడమ్మగుట్ట వీరాంజనేయ, సాయిబాబా, సత్యనారాయణస్వామి దేవాలయాలు మూసి వేశారు. గ్రహణం పూర్తయిన తర్వత పలు దేవాలయాలను తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు.


logo