శుక్రవారం 14 ఆగస్టు 2020
Vikarabad - Jun 21, 2020 , 22:27:01

మాస్కు లేకపోతే ఫైనే..

మాస్కు లేకపోతే ఫైనే..

  • వస్తే రూ.1000 జరిమానా
  • అమలు చేస్తున్న పోలీసులు
  • పట్టించుకోకుండా 
  • విచ్చలవిడిగా తిరుగుతున్న జనాలు

వికారాబాద్‌ టౌన్‌ : కరోనా వైరస్‌ మహమ్మరి రోజు రోజుకూ విజృంభిస్తున్నది. ఎటు నుంచి దాడి చేస్తున్నదో తెలియని పరిస్థితి. ఎవరి నుంచి ఎవరికీ సోకుతుందో ఆర్థం కాని భయం. బయటకు వస్తే వ్యక్తులు కచ్చితంగా ముఖాలకు మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటింటాలని అధికార యంత్రాంగం పదేపదే నెత్తీనోరూ బాదుకుంటున్నా జనం చేవికెక్కించుకోవడం లేదు. ఇప్పటికే జిల్లాలో 47 కరోనా కేసులు నమోదు కావడం, వికారాబాద్‌ పట్టణంలోని ఒక జ్యూవేలరి షాప్‌ యాజమానికి సైతం కరోనా సోకిన సంగతి తెలిసిందే. అయితే పట్టణం లో మాస్కులు లేకుండా రోడ్లపైకి వచ్చిన జనాలకు పోలీసులు రూ.1000 ఫైన్‌ వేయడం జరుగుతున్నది. కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని పోలీస్‌ యంత్రాంగం తెలియజేసింది.

మాస్కు  తప్పనిసరి.. 

పట్టణంలో ఇకపై మాస్కులు లేకుండా జనాలు రోడ్లపైకి వస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. గ్రామాల నుంచి వివిధ పనులపై బయటకు వచ్చే పాదచారులు, వాహనాల్లో ప్రయాణించే వారు మాస్కులు ధరించకపోతే పోలీసులు కొరడా ఝళిపించనున్నారు. ఒక్కొక్కరికి రూ. 1000 జరిమానా విధిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సహకరంతో కరోనా కట్టడికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా వాహనాలు సైతం వదిలేసి వెళ్లిన వారికి ఫైన్‌ వేయడం జరుగుతున్నది. దానిని కోర్టులో కట్టుకోవాలని పోలీసులు తెలిపారు.

నిబంధనలు బేఖాతర్‌...

వికారాబాద్‌లోని ప్రధాన రోడ్డు దగ్గరలోని ప్రముఖ జ్యూవేలరి షాప్‌, వివిధ గ్రామాల్లో 4 రోజులు కిందట కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రజలు ఎవరూ బయటకు రాకూడదని పోలీసులు తెలుపుతున్నారు. అత్యవసర సమయం లో తప్ప బయటకు రావద్దన్నారు. కానీ కొందరు దీనిని బేఖాతరు చేసి నిబంధనలను తుంగలో తొక్కి బయటకు వస్తున్నారు. అయితే పట్టణంలోని కొందరు పోకిరీలు ద్విచక్ర వాహనాలపై రోడ్లపైకి వచ్చి హల్‌చల్‌ చేస్తున్నారు.

స్వచ్ఛందంగా షాపుల మూసివేత...

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న సమయంలో పట్టణంలోని పలు దుకాణదారుల సంఘాలు పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కిరణ, జనరల్‌ స్టోర్స్‌, ఇతర సంఘాల సభ్యులు కరోనాను దృష్టిలో ఉం చుకొని షాపులను ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నారు. దీనికి తోడుగా తప్పనిసరిగా మాస్కులు ఉం టేనే షాపుల్లో నిత్యావసరాలు అందిస్తామని, కరోనా కట్టడిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. అదేవిధంగా సామాజిక దూరం సైతం పాటించాలని సంఘాల సభ్యులు సూచించారు. 

బ్యాంకుల వద్ద భౌతిక దూరం పాటించని జనం...

పట్టణంలోని పలు బ్యాంకుల వద్ద జనం గుంపులు గుంపులుగా ఉండి కరోనా వైరస్‌కు కారణం అవుతున్నా రు. సామాజిక దూరం పాటించకుండా దగ్గరదగ్గర లైన్‌లో నిలుచుంటున్నారు. పట్టణంలోని ఓ బ్యాంకు వద్ద ఖాతాదారలు భౌతిక దూరం పాటించడం లేదు. కనీసం మా స్కులు సైతం వినియోగించడం లేదు. బ్యాంకు సిబ్బంది దానిని చూసి చూడనట్లు వదిలి వేస్తున్నారు. ఏటీఎం ద్వారా అత్యధిక సంఖ్యలో ఖాతాదారులు లావాదేవీలు జరుగుతున్న క్రమంలో శానిటైజేషన్‌ చేయాల్సిన అవసరం  ఎంతైనా ఉంది.


logo