శుక్రవారం 07 ఆగస్టు 2020
Vikarabad - Jun 20, 2020 , 00:31:47

జీవ కళ.. ఉట్టిపడేలా..

జీవ కళ.. ఉట్టిపడేలా..

మనకు ఏ కళపై మక్కువ ఉంటుందో దానిపై శ్రద్ధ పెడితే అందులో ఆరి తేరవచ్చని నిరూపిస్తున్నాడు తాండూరుకు చెందిన మణిశంకర్‌. పట్టణంలోని సురేశ్‌కుమార్‌, శోభారాణి దంపతుల కొడుకు మణిసాయి (మణిశంకర్‌). తాండూరు పీపుల్స్‌ డిగ్రీ కళాశాలలో బీఏ చదువుతున్నాడు. పాఠశాల స్థాయి నుంచి తెల్లటి కాగితాలపై జీవం ఉట్టిపడేలా బొమ్మలు వేస్తు పలువురి ప్రశంసలు అందుకుంటు న్నాడు. స్కెచ్‌, ఆర్ట్‌, క్రాఫ్ట్‌ వర్కుతో పాటు పెన్సిల్‌పై మైక్రో ఆర్ట్స్‌ వేస్తున్నాడు. పెన్సిల్‌పై రకరకాల సూక్ష్మ కళాఖండాలు (బొమ్మలు, పేర్లను) రూపొందిస్తూ అందరిని అబ్బుర పరుస్తు న్నాడు. భవిష్యత్‌లో మరిన్ని కళాఖండాలు రూపొందించి గిన్నిస్‌ రికార్డు సంపా దించడమే తన లక్ష్యమని చెబుతున్నాడు. పెన్సిల్‌ ముక్కలపై అక్షరాలు లిఖిం చడం, బొమ్మలు వేయడం తో ఆర్ట్‌ ఉన్నోడు అని పించుకుంటున్నాడు మణిసాయి.

- తాండూరు


logo