సోమవారం 03 ఆగస్టు 2020
Vikarabad - Jun 17, 2020 , 23:56:54

ప్రేమ జంట ఆత్మహత్య

ప్రేమ జంట  ఆత్మహత్య

  • వికారాబాద్‌ జిల్లా  నవాబుపేట మండలం పూలపల్లి రెవెన్యూ పరిధిలో ఘటన
  • చేవెళ్ల మండలం గొల్లపల్లిలో అలుముకున్న విషాదఛాయలు

నవాబుపేట: ప్రేమ జంట చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండల పరిధి పూలపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 153లో బుధవారం చోటు చేసుకుంది. వీఆర్వో సత్తయ్య ద్వారా సమాచారం అందుకున్న వికారాబాద్‌ డీఎస్పీ సంజీవరావు సిబ్బందితో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. పోలీసులు, కుంటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన సార్ల కార్తీక్‌(21) ట్యాక్సీ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.  అదే గ్రామానికి చెందిన కటికె మీన (21)పక్క పక్కన ఇండ్లలో ఉన్న వీరు కొన్నేండ్లుగా ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారు. ఇదిలా ఉండగా నెల రోజుల క్రితం మీన కుటుంబ సభ్యులు మహేశ్వరం మండలంలోని గట్టుపల్లి గ్రామానికి చెందిన యువకునికిచ్చి మీన వివాహం చేశారు. దీంతో ఇద్దరు కలిసి జీవించే అవకాశం లేదని భావించిన వారు మంగళవారం ఇంట్లో చెప్పకుండా వెళ్లి పథకం ప్రకారం ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


logo