గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - Jun 17, 2020 , 00:09:31

చాపకింద నీరులా ‘కరోనా

 చాపకింద నీరులా ‘కరోనా

’మొయినాబాద్‌ : కరోనా వైరస్‌ మండలంలో చాపకింది నీరులా వ్యాప్తి చెందుతున్నది. ఇరవై రోజుల క్రితం మండలంలో మొదటి కరోనా కేసు నమోదు అయ్యింది. కాగా ఇప్పటి వరకు  మండలంలో 10 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం మండలంలో అజీజ్‌నగర్‌ గ్రామానికి చెందిన ఓ విశ్రాంతి ఉద్యోగికి కరోనా సోకింది. దీంతో అధికారులు అప్రమత్తమై బాధితుడి పరిసర ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. వైద్య సిబ్బంది అక్కడ పర్యటించి, వారికి జర్వ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా సురంగల్‌ చెందిన ఇద్దరు వ్యాపారులు నగరంలో నివాసం ఉంటారు. వారికి కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. అయితే గ్రామానికి చెందిన కొందరు వారితో కలిసినట్లు అనుమానం ఉండటంతో వైద్య సిబ్బంది వారి ఇండ్లకు వెళ్లి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులను కలిసినటైతే వారు స్వచ్ఛందంగా హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. సజ్జన్‌పల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నగరంలో నివాసం ఉంటున్నప్పటికీ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తితో కలిసి తిరిగాడని, వారి కుటుంబం కూడా  హోం క్వారంటైన్‌లో ఉండాలని  సూచించారు.  వెంకటాపూర్‌లో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి నాలుగు కుటుంబాలను కలవడంతో వారిని కూడా హోం క్వారంటైన్‌ చేశారు.

  చేవెళ్ల: నగరనికే పరిమితమైన కరోనా వైరస్‌ ఇప్పుడు చేవెళ్ల మండలంలోనూ రోజురోజూకు పెరిగి పోతున్నది. దీంతో చేవెళ్ల మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మంగళవారం మండల పరిధిలోని మల్లారెడ్డి గూడకు చెందిన ఓ వ్యక్తికి కరోనా వైరస్‌ సోకిందని వైద్యులు తెలిపారు. దీంతో అతడి కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌ చేశారు. అయితే ఇటీవల బాధితుడు ఒక పెళ్లికి హాజరయ్యాడు. దీంతో వివాహానికి వచ్చిన బంధువులు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

 దొంగఎన్కెపల్లిలో మరో పాజిటివ్‌..

 దోమ : మండల పరిధిలోని దొంగఎన్కెపల్లి గ్రామంలో ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ప్రభుత్వ ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్‌ మునీబ్‌ తెలిపారు.  వారం రోజుల క్రితం ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఆయన బంధువులలో ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. గ్రామంలో ఇంకా ఎవరైనా ఆ వ్యక్తిని కలిసి ఉన్నట్లయితే స్వచ్ఛందంగా   టెస్టులు చేసుకోవాలని డాక్టర్‌ మునీబ్‌ సూచించారు. logo