బుధవారం 05 ఆగస్టు 2020
Vikarabad - Jun 15, 2020 , 23:56:04

పెద్దేముల్‌ నూతన తాసీల్దార్‌గా హరితాదేవి

పెద్దేముల్‌ నూతన తాసీల్దార్‌గా హరితాదేవి

పెద్దేముల్‌: మండల నూతన తాసీల్దార్‌గా ఎం. హరితాదేవి సోమవారం తాసీల్దార్‌ కార్యాలయం లో విధుల్లో చేరారు. గతంలో హైదరాబాద్‌ హెచ్‌ఎండీఏలో తాసీల్దార్‌గా విధులు నిర్వహించిన హరితాదేవి ఆ తరువాత పార్లమెంట్‌ సాధారణ ఎన్నికల్లో భాగంగా మెదక్‌ జిల్లాలో విధులు నిర్వహించి ప్రస్తుతం పెద్దేముల్‌ మండలానికి నూతన తాసీల్దార్‌గా విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ కింది స్థాయి అధికారుల సమన్వయంతో మండల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సేవలు అందిస్తానని తెలిపారు.


logo