గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - Jun 16, 2020 , 00:27:28

నియంత్రిత పంటలు పండించేలా చర్యలు తీసుకోవాలి

నియంత్రిత పంటలు పండించేలా  చర్యలు తీసుకోవాలి

వీడియో కాన్ఫరెన్స్‌లో వికారాబాద్‌ కలెక్టర్‌ పౌసుమి బసు

బంట్వారం : రైతులు నియంత్రిత పంటలు పండించేలా వ్యవసాయాధికారులు చర్యలు తీసుకోవాలని వికారాబాద్‌ కలెక్టర్‌ పౌసుమి బసు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని తాసిల్దార్‌ కార్యాలయంలో రైతుబంధు మండల కో ఆర్డినేటర్‌, వ్యవసాయాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అందులో ముఖ్యంగా మండలంలో రైతులు పండించే పంటల వివరాలపై ఏవోతో చర్చించారు. ఇప్పటివరకు రైతులు ఎలాంటి పంటలు పండించేందుకు ఆసక్తి చూపుతున్నారని, అందుకు తగ్గ విత్తనాలు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్‌ సూచించారు. మండలంలో పత్తి 7500 ఎకారలు, కంది 3500 ఎకరాలు, మినుములు 300 ఎకరాలు, పెసళ్లు 690 ఎకరాల పంటలు వేసేందుకు రైతులను ప్రోత్సహించామని ఏవో కలెక్టర్‌కు తెలిపారు. అయితే రైతులు సోయబీన్‌ చోట ఆముదం పంటను పండిస్తే అధిక దిగుబడి ఉంటుందని, ఇందుకు తగ్గ చర్యలు వ్యవసాయాధికారులు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. అదేకాక సకాలంలో రైతులకు విత్తనాలు, ఎరువులు అందుతున్నాయా అని ఆరా తీశారు. కార్యక్రమంలో ఏవో సంధ్య, రైతుబంధు మండల కో ఆర్డినేటర్‌ మల్లారెడ్డి పాల్గొన్నారు.logo