మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - Jun 14, 2020 , 23:34:10

డ్రోన్‌ కెమెరాతో అనంతగిరిలో హల్‌చల్‌

డ్రోన్‌ కెమెరాతో అనంతగిరిలో హల్‌చల్‌

వికారాబాద్‌ రూరల్‌ : అనంతగిరి అటవీ, ఆలయ పరిసరాల్లో డ్రోన్‌ కెమెరాలకు ఎలాంటి అనుమతి లేదని పదేపదే అటవీ, ఆలయ అధికారులు చెబుతున్న పర్యాటకులు అధికారుల కన్నుగప్పి అటవీ ప్రాంతం, ఆలయ పరిసరాల్లో విచ్చలవిడిగా వాడుతున్నారు. ఆదివారం ఉదయం ఆలయ సమీపం లో ఎక్కువ సమయం డ్రోన్‌ కెమెరా తిరుగడంతో భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అధికారులను వివరణ కోరగా డ్రోన్‌ కెమెరా నిర్వాహకులు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని అటవీ శాఖ రేంజి అధికారి బాలయ్య, ఆలయ సిబ్బంది శాంతు తెలిపారు. logo