శనివారం 15 ఆగస్టు 2020
Vikarabad - Jun 14, 2020 , 23:10:06

కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులు

కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులు

  • మంత్రి కేటీఆర్‌  పిలుపునకు విశేష స్పందన
  • దోమల నివారణకు ప్రత్యేక చర్యలు 

మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. ముఖ్యంగా దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.  ప్రతి వారంలాగే ఈ ఆదివారం  కూడా ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు తమ ఇంటి పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. నీటి నిల్వల తొలగింపు, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడం, రసాయనాల పిచికారీ, మురుగు కాల్వల్లో ఆయిల్‌ బాల్స్‌ వేయడం, నీటి క్లోరినేషన్‌ వంటి పనులు చేశారు. వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ తన సతీమణితో కలిసి ఇంటి ఆవరణలో నీటి నిల్వలను తొలగించడంతోపాటు మొక్కలు నాటారు. షాద్‌నగర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ కొందూటి నరేందర్‌ నీటి ట్యాంక్‌ను శుభ్రం చేయగా.. తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న వార్డుల్లో తిరిగి పారిశుద్ధ్య పనులు చేయించారు. 


logo