మంగళవారం 04 ఆగస్టు 2020
Vikarabad - Jun 14, 2020 , 04:18:37

గుట్టను తొలిచి.. గుడులుగా మలిచి

గుట్టను తొలిచి.. గుడులుగా మలిచి

వికారాబాద్‌: యాభై ఏండ్ల క్రితం అదో కాకులు దూరని కారడవి. పశువులకాపరులు మాత్రమే కనిపించే నిర్మాణు ష్య ప్రాంతం. అలాంటిది ఇప్పుడు పచ్చని చెట్లతో... ప్రకృ తి రమణీయతతో పరిఢవిల్లుతున్న ఆధ్యాత్మిక క్షేత్రం. నిత్యం పూజ వైభవకాంతితో కళకళలాడుతున్నది. ఈ అద్భుత సృష్టికి కారణం ఒక సామాన్యుడు. అంతులేని భక్తి ప్రపత్తులతో నారసింహుడిని కీర్తిస్తున్న పరమయ్యదాసుపై ‘నమస్తే తెలంగాణ’ స్పెషల్‌  స్టోరీ...

వర్షం మార్చిన జీవితం

వికారాబాద్‌ జిల్లా వెల్చాల్‌ సమీపంలో ఉంది ఈ ప్రాం తం. ఒకప్పుడు దట్టమైన చెట్లతో కారడవిని తలపిస్తూ పులులు సంచరించడంతో ఈ గుట్ట ప్రాంతాన్ని పులి లొం కగా పిలిచేవారు. ఆ గుట్టకు పశువులను మేపేందుకు వెళ్లేవారు పరమయ్యదాసు. వర్షం వస్తే తలదాచుకునేందుకు గుట్టను తొలగించి చిన్న పాటి స్థావరం ఏర్పరుచుకున్నారు. ఒక రోజు కురిసిన కుండపోత వర్షం దాటి కి తట్టుకోలేక మిగిలిన వాళ్లంతా ఇంటికి వెళ్లిపోతే ఆయన మాత్రం అక్కడే ఉన్నారు. రాత్రి కలలో నరసింహస్వామి కనిపించి తన కూ గుట్టపై చోటు కల్పించాలన్నారట.

తిరిగి ఇంటికెళ్లలేదు

మరుసటి రోజు స్నేహితులంతా గుట్టకు వెళ్లారు. పొద్దుపొడిచాక ఇం టికెళ్లారు. పరమయ్యదాసు మా త్రం ఇంటికి వెళ్లొద్దని నిర్ణయించుకున్నారు. స్వామి ఆజ్ఞానుసా రం గుట్టను తవ్వడం ప్రారంభించారు. ఆకలి..దప్పికలనూ మరిచిపోయి రాత్రింబవళ్లు గుట్టను తొలిచారు. రోజు కష్టపడుతూ సొరంగం లాంటి దోవను తొవ్వారు. పరమయ్యదాసు యువకుడిగా ఉన్నప్పటి నుంచి సుమారు 20 సంవత్సరాల పా టు గుట్టను తొలిచి గుడిగా మలిచాడు. ఇప్పటికీ పరమయ్యదాసు ఒక్కడే గుడి వద్ద నివాసం ఉంటున్నాడు. తన సోదరులు పరమయ్యదాసుకు నిత్యం భోజనం అందిస్తున్నారు. పరమయ్యదాసు ప్రయత్నానికి గ్రామస్తుల సహకారం లభించింది.  లక్ష్మీనరసింహుడిని ప్రతిష్ఠింపజేసి ప్రతీ సంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

గుట్టలో అద్భుతం

బయట నుంచి చూస్తే మామూలు గుట్టల్లాగే పులి లొంక కనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్తే అద్భుతాలు కనిపిస్తా యి. టెక్నాలజీ అంతగా అందుబాటు లో లేని ఆ రోజుల్లో ఇంత పెద్ద దొనను ఒంటరిగా ఆవిష్కరించడం అద్భుతమేనంటారు ఈ ప్రాంతాన్ని దర్శించినవా రు. నున్నటి గోడలతో కనిపించే దొన లోపలిభాగం పూతపూసినట్టుగా ఉం టుంది. అదంతా పరమయ్యదాసు చేతిమాయే. ఆ కళాత్మకత చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. గుట్ట మొదట్లో పరమయ్యదాసు తవ్వించిన గుండంలో నీరు పుష్కలంగా ఉంటుంది. 

స్వామికే తెలుసు

ఇంత పెద్ద గుట్టను తొలిచి గుడిగా మలిచిన వ్యక్తి బాగా బలిష్టుడై ఉంటాడనుకోవచ్చు. కానీ పరమయ్యదాసు మా త్రం బక్కపలుచని మనిషి. రోజుకు ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తారు. ఇతరుల చేతితో ఏం పెట్టినా తినరు. ఆడంబరాలు ఉం డవు. దోతి, బనీను, మెడలో జపమాల... భుజాలపై ఒక గొం గడి... ఇదే ఆయన ఆహా ర్యం. అంతా ఆ స్వామికి తెలుసు.. నన్నూ ఆయన నడిపిస్తున్నారు. మీ బాధ లు.. కోర్కెలు ఏమైనా ఉం టే ఆయనతో చెప్పుకోండి అంటూ భక్తులకు సలహా ఇస్తుంటారు. 

మరెన్నో ఆలయాలు

గుడిపై లక్ష్మీనరసింహస్వామి ఆలయమే కాకుండా గ్రామస్తుల చొరవతో భద్రేశ్వరస్వామి, మల్లికార్జునస్వామి, ఆంజనేయస్వామి, నాగేశ్వరస్వామి ఆలయాలు సైతం గుట్టపై కొలువుదీరాయి. పరమయ్యదాసు యువకుడిగా ఉన్నప్పుడు స్వామికి అంకితమయ్యాడు. ప్రతీ సంవత్సరం వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఊళ్లో ఉన్న ఆంజనేయస్వామి ఆలయం నుంచి గుట్ట వరకు స్వామివారి ఉత్సవ విగ్రహానికి నిర్వహించే రథోత్సవం కన్నులపండువగా జరుగుతుంది.


logo