శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Vikarabad - Jun 14, 2020 , 04:15:49

జనన, మరణ ధ్రవీకరణ పత్రాలకు దరఖాస్తు చేసుకోండి..

జనన, మరణ ధ్రవీకరణ పత్రాలకు దరఖాస్తు చేసుకోండి..

వికారాబాద్‌ టౌన్‌ : జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు పొందడం చాలా సులభతరం. ప్రజలు ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇప్పుడు జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు పొందడం ఇక సులువు. ఈ ధ్రువీకరణ పత్రాలు ఉంటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ప్రభుత్వ సేవలు మొదలుకొని విదేశాల్లో ఉన్నత విద్య, ఉపాధి తదితర పనుల నిమిత్తం వెళ్లేందుకు అవసరమైన పాస్‌పోర్ట్‌ మంజూరులో కూడా జనన పత్రాలు తప్పనిసరి విద్యార్థులను పాఠశాలలో చేర్పించే సమయంతో మొదలు కొని ఉద్యోగాలు పొందేందుకు ప్రామణికంగా ఎంతగానో ఉపయోగపడుతున్నది. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలకు దరఖాస్తు ఇలా చేసుకోవాలి

ఎప్పుడైనా పేరు పెట్టుకోవచ్చు ... 

జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం పట్టణ పురపాలికలో మధ్యవర్తులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. మరింత సమాచారం కోసం జనన, మరణ శాఖను సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను ఏడాది లోపే తీసుకోవడం మంచిది. బ్రోకర్లకు మున్సిపల్‌లో అడ్డగా మారింది. ప్రతి రోజు మున్సిపల్‌కు జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం వచ్చే వారిని మధ్యలోనే అడ్డుకొని దంద కొనసాగిస్తున్నారు. ప్రతి నిత్యం మధ్యవర్తులు రూ.500 నుంచి రూ.2000 వరకు సంపాదిస్తున్నారు. పురపాలిక శాఖ అధికారులు దృష్టి సారిస్తే ప్రజలు దళారులను నమ్మకుండా ఉంటారు. 

 • దరఖాస్తు చేసుకునే విధానం

  • పుట్టిన రోజు నుంచి 21 రోజు వరకు నోటరీ లేకుండా దరఖాస్తు చేయాలి.
  • దవాఖానలో దరఖాస్తుకు డెలివరీ సర్టిఫికెట్‌తో పాటు తండ్రి, తల్లి ఆధార్‌ కార్డు జత చేసి మీ సేవాలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది
  • పుట్టిన 21 రోజుల నుంచి ఏడాది లోపు అయితే దవాఖాన డెలివరీ సర్టిఫికెట్‌తో ఆఫిడవిట్‌ జత పరిచి మీ సేవాలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
  • సంబంధిత పత్రాలను పురపాలికలోని జనన, మరణ శాఖలో అందించాలి.
  • వారం రోజులో జనన ,మరణ పత్రాలను మీ సేవాలో తీసుకోవచ్చు. 
  • ఏడాది దాటిన తర్వాత అయితే పురపాలికలో నాన్‌ ఆవలెబుల్‌ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు ఫారం పూర్తి చేయాలి.
  • ఇందులో ఇందుకోసం మీ సేవాలో రూ.95 చెల్లిస్తే నాన్‌ ఆవలెబుల్‌ సర్టిఫికెట్‌ ఇస్తారు.
  • మండల కార్యాలయంలో పదో తరగతి మోమో, బోనఫైడ్‌, ఆధార్‌ కార్డుతో దరఖాస్తు చేసుకోవాలి.
  • అక్కడ సంబంధిత అధికారులు విచారణ చేసి ఆన్‌లైన్‌ రిపోర్ట్‌ ఆర్‌డీవో కార్యాలయానికి పంపుతారు.
  • అక్కడ విచారణ పరిశీలించి ప్రోసిండింగ్‌ను జారీ చేస్తారు.
  • ప్రోసిండింగ్‌ను పురపాలికలో అందజేస్తే జనన సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు.
  • మరణ ధ్రువీకరణ పత్రం ఏడాది లోపు అయ్యితే మరణ సర్టిఫికెట్‌ ఫారంతో ఆ వార్డు పరిధిలో మున్సిపల్‌,  జవాన్‌ పంచనామా, ముగ్గురు సాక్షుల సంతకాలతో పాటు దరఖాస్తుదారుడి ఆధార్‌ కార్డుతో దరఖాస్తు  చేసుకోవాల్సి ఉంటుంది.
  • నెల లోపు జనన ధ్రువీకరణ పత్రం పొందవచ్చు. పేరు లేకుండా కూడా జనన ధ్రువీకరణ పత్రం తీసుకోవచ్చు.


logo