బుధవారం 05 ఆగస్టు 2020
Vikarabad - Jun 13, 2020 , 01:15:03

మొక్కల రక్షణ మన బాధ్యత

మొక్కల రక్షణ మన బాధ్యత

కొడంగల్‌, నమస్తే తెలంగాణ :  మొక్కలను రక్షించుకున్నప్పుడే మానవాళికి స్వచ్ఛమైన వా యువు, వాతావరణ పరిరక్షణ సాధ్యపడి జీవనం సాఫీగా సాగుతుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాలుగా వర్షాకాలం ప్రారంభంతో హరితహారం చేపట్టి కోట్లాది మొక్కలకు ప్రాణం పోస్తున్నది. హరితహారంలో భాగంగా నాడు నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి నీడనిస్తున్నట్లు వాతావరణ ప్రేమికులు తెలుపుతున్నారు. ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో నాటిన మొక్క లు నీడను కల్పిస్తున్నాయని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పశువైద్య కార్యాలయంలో గత సంవత్సరం నాటిన మొక్కలు పెరిగి ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తున్నాయి. శుక్రవారం కార్యాలయ సిబ్బంది ఉషారావు, దేవప్పలు కార్యాలయ ఆవరణలోని మొక్కలకు నీటిని అందించడంతోపాటు వాటి సంరక్షణ చర్యలు చేపట్టారు. కార్యాలయానికి పూర్తిస్థాయిలో ప్రహరీ లేకపోవడంతో పశువులు కంపౌండ్‌లోకి వెళ్లి మొక్కలు తీంటున్నాయని, పూర్తిస్థాయిలో ప్రహరీ ఏర్పాటు చేస్తే మొక్కలకు పూర్తిస్థాయి సంరక్షణ ఉంటుందన్నారు. ప్రతి శుక్రవారం మొక్కల సంరక్షణ చర్యలతోపాటు నీటిని అందించి వాటిని కాపాడుతున్నట్లు తెలిపారు.


logo