మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - Jun 13, 2020 , 01:13:57

దేవాలయాల అభివృద్ధికి కృషి

దేవాలయాల అభివృద్ధికి కృషి

ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి 

శ్రీ పాంబండ రామలింగేశ్వరస్వామి దేవాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ

కులకచర్ల : దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు.  శ్రీ పాంబండ రామలింగేశ్వరస్వామి దేవాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డితో కలిసి భూమి పూజచేశారు. కార్యక్రమంలో దేవాల య చైర్మన్‌ ఘనపురం రాములు, ఎంపీపీ సత్య హరిచంద్ర, జడ్పీటీసీ రామదాసు, పీఏసీఎస్‌ చైర్మన్‌ నాగరాజు, రాజు పాల్గొన్నారు.

పీఆర్‌టీయూ భవన నిర్మాణానికి స్థల పరిశీలన

మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట పీఆర్‌టీయూ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి స్థల పరిశీలన చేశా రు. పీఆర్‌టీయూ నాయకుల ఆధ్వర్యంలో వారి అభ్యర్థన మేరకు  ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. స్థలానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ మండల అధక్ష్య కార్యదర్శులు శ్రీనివాస్‌రెరెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు పరందాములు, సభ్యులు పాల్గొన్నారు.

పేదలకు ఉపయోగంగా కల్యాణలక్ష్మి 

కులకచర్ల : పేదలకు కల్యాణలక్ష్మి ఎంతగానో ఉపయోగపడుతుందని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేం ద్రంలోని తాసిల్దార్‌ కార్యాలయంలో 32మందికి కల్యాణలక్ష్మి చెక్కు లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఆడపిల్లలు ఉంటేనే భయపడేవారన్నారు. గ్రామాల్లో ఉన్న  అర్హులందరికీ కల్యాణలక్ష్మి వర్తింపచేయాలని అధికారులకు సూచించారు. సం క్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి, ఎంపీపీ సత్యహరిచంద్ర, జడ్పీటీసీ రాందాస్‌నాయక్‌,  తహసీల్దార్‌ అశోక్‌కుమార్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నర్సిములు,  నాగరాజు, పీరంపల్లి రాజు,  సుధాకర్‌రెడ్డి, శేరి రాంరెడ్డి, తహశీల్దారు అశోక్‌కుమార్‌, వివిధ గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.


logo