బుధవారం 12 ఆగస్టు 2020
Vikarabad - Jun 13, 2020 , 01:05:47

పరిశ్రమలతో పెరుగనున్న ఉపాధి

పరిశ్రమలతో పెరుగనున్న ఉపాధి

n కేసీఆర్‌ సీఎంగా ఉండడం అదృష్టం

n పరిశ్రమల ఏర్పాటుకు పెద్దపీట 

n విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

కందుకూరు: అన్ని వర్గాల ప్రజలను అక్కున చేర్చుకుని ఆదుకుంటున్న కేసీఆర్‌ సీఎంగా ఉండడం తెలంగాణ ప్రజల అదృష్టమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శ్రీశైలం రహదారి నుంచి కందుకూరు మీదుగా ఫార్మాసిటీ రోడ్డుకు రూ.10 కోట్లతో విస్తరిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం రంగారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డితో కలిసి మంత్రి రోడ్డుకు మండల పరిషత్‌ కార్యాలయం వద్ద శంకుస్థాపన చేశారు. అనంతరం మండల కేంద్రంలోని పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో రైతులకు రూ.2.31 కోట్ల స్వల్పకాలిక రుణాల చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా  మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిశ్రమలకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. మండలంలోని ముచ్చర్లలో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఫార్మాసిటీకి వెళ్లడానికి రూ.60 కోట్లతో లింకు రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. మీర్‌ఖాన్‌పేట్‌ పెద్దమ్మ గుడి నుంచి యాచారం వరకు రూ.43 కోట్లు, కందుకూరు నుంచి ఫార్మాసిటీ రోడ్డు వరకు రూ.10 కోట్లతో విస్తరణ పనులు చేపడుతున్నామన్నారు. 

మంత్రికేటీఆర్‌ చొరవతో పరిశ్రమలు

మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవ వల్ల పెద్దఎత్తున పరిశ్రమలు నెలకొల్పేందుకు చాలామంది ముందుకొస్తున్నారన్నారు. జిల్లాలో మీర్‌ఖాన్‌పేట్‌, షాబాద్‌ మండలంలోని చందన్‌వెల్లిలో అమెజాన్‌ డాటా కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నట్లు, అందుకోసం భూములు సేకరించినట్లు తెలిపారు. దీంతో స్థానికులకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. అత్యుత్తమ ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీకి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు. 

63 శాతం ధాన్యం కొనుగోలు

కరోనా సమయంలో లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్‌ చొరువ తీసుకుని 63 శాతం ధాన్యం కొనుగోలు చేశారని మంత్రి అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసినట్లు తెపారు. జిల్లా వ్యాప్తంగా రైతులకు రూ.200 కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. రూ.3వేల కోట్లతో చెక్‌ డ్యాములు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి, ఎంపీపీ జ్యోతి, జడ్పీటీసీ జంగారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వరలక్ష్మి, పీఏసీఎస్‌ చైర్మన్‌ చంద్రశేఖర్‌, వైఎస్‌ చైర్మన్‌ గోపిరెడ్డి విజేందర్‌రెడ్డి, వైఎస్‌ ఎంపీపీ శమంతారెడ్డి, ఎంపీటీసీ రాజశేఖర్‌రెడ్డి, సర్పంచ్‌ శమంతకమణి, ఈఈ మోహన్‌, డీఈ యాదయ్య, జేఈ రాజశేఖర్‌, ఆర్‌డీవో రవీందర్‌రెడ్డి, తహసీల్దారు జ్యోతి, ఎంపీడీవో కృష్ణకుమారి, నాయకులు జయేందర్‌, కృష్ణరాంభూపాల్‌రెడ్డి, లక్ష్మీనర్సింహరెడ్డి, జయేందర్‌ ముదిరాజ్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 


logo