శనివారం 15 ఆగస్టు 2020
Vikarabad - Jun 11, 2020 , 23:24:17

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

- వికారాబాద్‌ కలెక్టర్‌ పౌసుమి బసు

కోట్‌పల్లి: సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వికారాబాద్‌ కలెక్టర్‌ పౌసుమి బసు సూచించారు. గురువారం మండలంలోని ఇందోల్‌ గ్రామాన్ని సందర్శించి 8 రోజులుగా నిర్వహిస్తున్న ప్రణాళిక పనులను పరిశీలించారు. అధికారులు సక్రమంగా పనులు చేయించడం లేదని మండిపడ్డారు. పెండింగ్‌లో ఉన్న పనులు ఈ నెల లోగా పూర్తి చేయాలన్నారు. ప్రణాళిక పనులు అంతంతా మాత్రంగా నిర్వహిస్తున్నారన్నారు. మురుగు కాలువలను శుభ్రం చేయాలని గ్రామ కార్మికులకు సూచించారు. గ్రామంలో ఉపాధి హామీ పనులు కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రామచందర్‌, ఎంపీడీవో లక్ష్మీనారాయణ, ఎంపీవో పుల్లయ్య, కార్యదర్శి, గ్రామస్తలు ఉన్నారు. 


logo