మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - Jun 11, 2020 , 23:22:03

రూ.74కోట్లతో చెక్‌డ్యామ్‌లు

రూ.74కోట్లతో చెక్‌డ్యామ్‌లు

  • గణనీయంగా పెరుగనున్న భూగర్భజలాలు 
  • రైతులను రాజులుగా చేయడమే  సీఎం ధ్యేయం 
  • తాండూరులో కంది బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తాం  
  • మంత్రి సబితా ఇంద్రారెడ్డి 
  • వికారాబాద్‌ జిల్లా ధారూరు, యాలాల మండలాల్లో పర్యటన 
  • వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

మూడు దశాబ్దాలుగా ముందుకు సాగని శివసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి  త్వరలో శ్రీకారం చుడతామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గురువారం వికారాబాద్‌ జిల్లాలోని ధారూరు మండలం దోర్నాల్‌ గ్రామంలో పెద్దవాగు మెథడిస్ట్‌ జాతర ఆనకట్ట,  దోర్నాల్‌ ఆనకట్ట, యాలాల మండలం కోకట్‌ వద్ద  చెక్‌డ్యామ్‌ల నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి రూ.74 కోట్లు విడుదలయ్యాయన్నారు. ఈ చెక్‌డ్యామ్‌లతో భూగర్భజలాలు గణనీయంగా పెరుగుతాయన్నారు.  

    - తాండూరు/ధారూరు

తాండూరు : ప్రాజెక్టులు, ఆనకట్టల నిర్మాణాలతో తెలంగాణలో రెండో హరిత విప్లవం వస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి అన్నారు. గురువారం యాలాల మండలం రాస్నంలో సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.10లక్షలు, ముద్దాయిపేట్‌లో సీసీ రోడ్డుకు రూ.10 లక్షలు, తుప్పర్లగడ్డ తండాలో బీటీరోడ్డుకు రూ.90 లక్ష లు, సంగాయిగుట్ట తండాలో బీటీ రోడ్డుకు రూ.30 లక్ష లు, అచ్యుతాపూర్‌లో సీసీ రోడ్డుకు రూ.15లక్షలు, నాగసముందర్‌లో సీసీ రోడ్డుకు రూ.10లక్షలు, రాఘవపూర్‌లో సీసీ రోడ్డుకు రూ.10లక్షలు, కోకట్‌లో చెక్‌డ్యాం నిర్మాణానికి రూ.9.62కోట్లు, అగ్గనూర్‌లో సీసీ రోడ్డుకు రూ10లక్షలు, గోవింద్‌రావుపేట్‌లో బీటీ రోడ్డుకు రూ. 50లక్షలు మొత్తం రూ.11.97కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా మారుతున్నాయన్నారు. గంగను భగీరథుడు శివుడి నెత్తినుంచి కిందకు తెస్తే, అపరభగీరథుడైన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అదే గంగను కిందనుంచి 618 మీటర్ల పైకి తెచ్చారని కొనియాడారు.

కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులతో రాష్ట్రంలో జల విప్లవం రాబోతున్నదన్నారు. రంగారెడ్డి-పాలమూరు రెండో విడుతలో తాండూరు ప్రాంతానికి సాగునీరు అందిస్తామన్నారు. వర్షం నుంచి వచ్చిన ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.3 వేల కోట్లతో 639 చెక్‌డ్యాం (ఆనకట్ట)లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా వికారాబాద్‌ జిల్లాకు రూ. 74 కోట్లు విడుదల చేశారని వెల్లడించారు. నియంత్రిత వ్యవసాయంతో రైతులకు మంచి లాభాలు వస్తాయన్నారు. అందుకు ప్రభుత్వం సూచించిన కంది, పత్తి, మినుము, పెసరుతో పాటు సన్నరకం వరి పంటలనే వేయాలని సూచించారు. మిడతల దండు ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నదన్నారు. దేశంలోనే రుచి, నాణ్యతకు తాం డూరు కందిపప్పు పేరుగాంచిందని పేర్కొన్నారు. అందుకనుగుణంగా తాండూరులో కంది బోర్డును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. మూ డు దశాబ్దాలుగా ముందుకు సాగని శివసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు తొలగించి త్వరలో పనులకు శ్రీకారం చుడతామని వెల్లడించారు. అదేవిధంగా తాం డూరు నియోజకవర్గంలో తాండూరు - కొడంగల్‌ కాగ్నా నది వంతెన నిర్మాణం, రింగురోడ్డుతో పాటు ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ సర్కారు రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ప్రత్యేక నిధులు, పథకాలు ప్రవేశ పెడుతుందన్నారు.

జెడ్పీ చైర్‌పర్సన్‌ సునితారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వెనుకబడిన వికారాబాద్‌ జిల్లాకు ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ బైండ్ల విజయ్‌కుమార్‌, యాలాల ఎంపీపీ బాలేశ్వర్‌ గుప్త, జెడ్పీటీసీ సంధ్యారాణి, వైస్‌ ఎంపీపీ రమేశ్‌, మాజీ ఎంపీపీ కరణం పురుషోత్తంరావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సిద్రాల శ్రీనివాస్‌, సహకార సంఘం చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, డైరెక్టర్‌ విఠల్‌ నాయక్‌, కోఆప్షన్‌ సభ్యులు అక్బర్‌బాబ, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చెక్‌ డ్యామ్‌ నిర్మాణాలతో భూగర్భ జలాల పెంపు 

ధారూర్‌ : చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలతో భూగర్భ జలాలు పెరుగుతాయని, ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. గురువారం వికారాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని ధారూరు మండలంలోని దోర్నాల్‌లో మెతడిస్ట్‌ జాతర వద్ద చెక్‌డ్యామ్‌ నిర్మాణం కోసం రూ.2.30.50కోట్లు, పెద్దవాగు వద్ద చెక్‌డ్యాం కోసం రూ.1.61.50కోట్లతో నిర్మాణ పనులను వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఎకరానికి సాగునీరు, కరెంట్‌, ఎరువులు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన కొద్ది రోజులోనే ప్రగతిని సాధించామన్నారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా మిషన్‌ కాకతీయతో చెరువుల పూడికతీత పనులు చేపట్టి చెరువులను బాగు చేయించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో వికారాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌, ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, గ్రామస్తులు ఉన్నారు. logo