గురువారం 13 ఆగస్టు 2020
Vikarabad - Jun 10, 2020 , 23:59:00

వికారాబాద్‌ జిల్లా అంతటా కురిసిన ఓ మోస్తరు వర్షం

వికారాబాద్‌ జిల్లా అంతటా కురిసిన ఓ మోస్తరు వర్షం

  • వానకాలం సీజన్‌లో 4.80 లక్షల ఎకరాల్లో సాగు ప్రణాళిక

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: జిల్లాలో ఓ మోస్తరు వర్షం పడింది. బుధవారం జిల్లా అంతటా ఓ మోస్తరు వర్షం కురిసింది. అన్ని మండలాల్లో తెల్లవారుజామున చిరుజల్లులతో కూడిన వర్షం కురువగా, సాయంత్రం కూడా ఓ మోస్తరు వర్షం కురిసింది. అయితే గతేడాది 20 రోజులు ఆలస్యంగా పలుకరించినా ఈ ఏడాది సరైన సమయానికి కురిసాయి. ఇప్పటికే దుక్కి దున్ని విత్తనాలను నాటేందుకు వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓ మోస్తరు వర్షం మాత్రమే కురిసింది కాబట్టి ఇప్పుడే ఎవరూ విత్తనాలను నాటోద్దని జిల్లా వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. భూమిలో సరిపోను పదను ఉంటేనే విత్తనాలు నాటాలని, సరైన పదను లేనట్లయితే మొలకెత్తిన విత్తనాలు ఎండిపోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా 60 నుంచి 70 మి.మీటర్ల వర్షపాతం నమోదైన తర్వాతనే విత్తనాలను నాటితే నాటిన ప్రతీ విత్తనం మొలకెత్తే అవకాశముంటుందంటున్నారు. మరోవైపు జిల్లాలో వానకాలం సీజన్‌లో 4.80 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగవుతాయని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. అదేవిధంగా జిల్లాలో సరిపోను ఎరువులు, విత్తనాలను కూడా అందుబాటులో ఉంచారు.

తొందర పడొద్దు...: జిల్లా వ్యవసాయాధికారి గోపాల్‌

జిల్లా రైతులెవరూ కూడా తొందరపడి ఇప్పుడే విత్తనాలు వేయొద్దని, నేలలో సరిపోను తేమ శాతం వచ్చిన తర్వాతనే విత్తనాలను నాటాలని జిల్లా వ్యవసాయాధికారి గోపాల్‌ సూచించారు. మరో ఒకట్రెండు మంచి వానలు కురిసిన అనంతరమే విత్తనాలను నాటాలన్నారు. ఒకవేళ ఇప్పుడే విత్తనాలను నాటితే విత్తనాలు మొలకెత్తవని, మళ్లీ విత్తనాలను నాటాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. రైతులందరూ పత్తి, కంది పంటలను సాగు చేయాలన్నారు. వానకాలం సీజన్‌లో సాగు చేసే పంటలకు సరిపడా ఎరువులు, విత్తనాలను జిల్లాలో అందుబాటులో ఉంచామని గోపాల్‌ వెల్లడించారు. logo