ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Jun 09, 2020 , 00:51:25

పది పరీక్షలు రద్దు.. ఊరట చెందిన తల్లిదండ్రులు

పది పరీక్షలు రద్దు.. ఊరట చెందిన తల్లిదండ్రులు

వికారాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఉత్కంఠ వీడింది. పదో తరగతి విద్యార్థులను పై తరగతులకు ఉత్తీర్ణులైనట్లు ప్రభుత్వం ప్రకటించడంతో విద్యార్థుల్లో నెలకొన్న భయాలు పటాపంచలయ్యాయి. వికారాబాద్‌ జిల్లాలో మొత్తంగా 13786 విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సిద్ధంగా ఉండగా తాజాగా ప్రభు త్వం వారంతా ఉత్తీర్ణులైనట్లు ప్రకటించడంతో వి ద్యార్థులు, వారి తల్లిదండ్రులు కాస్త ఉపశమనం పొందారు. కరోనా నేపథ్యంలో బయటికి వెళ్లాలంటే భయపడుతున్న తరుణంలో ప్రభుత్వ నిర్ణయం అ ందరిలో సంతోషాన్ని నింపింది. మార్చి నెలలో ని ర్వహించాల్సిన పది పరీక్షలకు జిల్లాలో విద్యాశాఖాధికారులు 67 సెంటర్లను సిద్ధం చేయగా మూడు ప రీక్షలు నిర్వహించారు.ఆ తర్వాత కరోనా నేపథ్యం లో ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 5వ లాక్‌డౌన్‌లో సడలింపులు ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పది పరీక్షలను ఈ నెల 8 నుంచి నిర్వహించేందుకు సిద్ధమవ్వగా జిల్లాలో విద్యాశాఖాధికారులు మరో 33 సెం టర్లను పెంచుతూ పరీక్షలకు పూర్తిగా సన్నద్ధమైన తరుణంలో హైకోర్టు తీర్పుతో మరోమారు పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇదిలాఉంటే సోమవారం రాష్ట్ర ప్రభుత్వం పది పరీక్షలను పూర్తిగా రద్దు చేస్తూ విద్యార్థులకు ఇంటర్నల్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్‌ విధానంతో ఉత్తీర్ణులను చేస్తున్నట్లు నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


logo