గురువారం 13 ఆగస్టు 2020
Vikarabad - Jun 09, 2020 , 00:48:27

ప్రభుత్వ భూముల పరిశీలన

ప్రభుత్వ భూముల పరిశీలన

అటవీశాఖకు ప్రత్యామ్నాయంగా ఇచ్చేందుకు ముద్విన్‌ గ్రామంలో

భూములను పరిశీలించిన కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ 

కడ్తాల్‌: మండలంలోని ముద్విన్‌ గ్రామ రెవెన్యూ పరిధిలోని కొర్చకొండతండా సమీపంలోని ప్రభుత్వ భూమిని సోమవారం మధ్యాహ్నం అదనపు కలెక్టర్‌ హరీశ్‌, ఆర్డీవో రవీందర్‌రెడ్డి, తాసిల్దార్‌ మహేందర్‌రెడ్డితో కలిసి కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ పరిశీలించారు. జిల్లాలో మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ ఏర్పాటు కోసం అక్కడక్కడ అటవీశాఖకు సంబంధించిన భూ ములను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుం ది. ప్రభుత్వం తీసుకున్న అటవీశాఖ భూములకు ప్రత్యామ్నాయంగా తిరిగి ప్రభుత్వం అటవీశాఖకు భూములను కేటాయించాల్సి ఉంది. కలెక్టర్‌ నేతృత్వంలోని అధికార బృందం ముద్విన్‌ గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్లు 355, 356లో ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలించారు. ఆయా భూములకు సంబంధించిన వివరాలను పరిశీలించి, నివేదికలను అటవీశాఖకు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఐ సురేందర్‌, వీఆర్వో మహేశ్‌, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.


logo