సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Jun 08, 2020 , 00:11:32

నేటి నుంచి తెరుచుకోనున్న ఆలయాలు

నేటి నుంచి తెరుచుకోనున్న ఆలయాలు

  • భక్తులకు మాస్క్‌లు తప్పనిసరి
  • చిన్నపిల్లలు, వృద్ధులకు అనుమతి లేదు..
  • భౌతిక దూరం పాటించేలా బాక్సులు
  • ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
  • ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో సోడియం హైపోక్లోరైట్‌ పిచికారీ చేయించిన ఆలయ సిబ్బంది 

వికారాబాద్‌ రూరల్‌, తాండూరు టౌన్‌, తాండూరు రూరల్‌, బషీరాబాద్‌, కడ్తాల్‌: లాదాదాపు రెండు నెలలకు పైగా అమ లులో ఉన్న లాక్‌డౌన్‌ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సడలింపుల ఇచ్చిన నేపథ్యంలో ఆలయాలు నేటి నుం చి తెరుచుకోనున్నాయి. దీంతో భగవంతునికి ఇంత కాలం దూరమైన భక్తుల ఆధ్యాత్మిక సేవలు ఇక పుంజుకోనున్నా యి. లాక్‌డౌన్‌ కాలంలో అర్చకులు నిరాడంబరంగా స్వా మి వారికి పూజలు నిర్వహించారు. ఈ మేరకు దేవాలయా ల్లో భక్తుల దైవ దర్శనాలకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. లాక్‌డౌన్‌ వల్ల మూతపడిన అనంతగిరి అనంతపద్మనాభస్వామి దేవాలయం, బుగ్గ రామలింగేశ్వరాలయం, పట్టణంలోని వేంకటేశ్వరస్వామి, రామమందిరం, తాండూరు దేవాదాయ శాఖ పరిధిలోని భావిగి భద్రేశ్వర దేవాల యం, కాళికాదేవి ఆలయం, పోట్లీ మహారాజ్‌ దేవాలయం, సీతారాంపేట్‌ హనుమాన్‌ దేవాలయం, స్టేషన్‌ హనుమాన్‌ దేవలయం, తాండూరు మండలం కొత్లాపూర్‌లోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం, అంతారంతండాలోని భూ కైలాస్‌ దేవాలయాలం, మైసిగండి మైసమ్మ ఆలయం, బషీ రాబాద్‌ మండలంలోని ఏకాంబరి రామలింగేశ్వరుడి ఆల యం, జీవన్గి మహాదేవ లింగేశ్వర ఆలయం, నవంద్గి సం ఘమేశ్వర ఆలయాల్లో నేటి నుంచి పూజలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ, దేవాదాయ శాఖల ఆదేశాల మేరకు అన్ని ఆలయాల్లో శుద్ధి, సంప్రోక్షణ పనులు చేపట్టారు. ఆలయా ల ప్రాంగణాలను సిబ్బంది హైపోక్లోరైట్‌తో శుద్ధి చేశారు. 

తీర్థం, ప్రసాదాలు నిషిద్ధం...

దైవ దర్శనాలకు వచ్చే భక్తులకు తీర్థ, ప్రసాదాలు, శఠగోప సేవలపై కొన్ని రోజుల పాటు నిషేధం విధిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు దర్శనానికి వచ్చే మార్గంలో భౌతిక దూరం పాటించేలా బాక్సులు ఏర్పాటు చేశామన్నా రు. భక్తులకు కేవలం దర్శనం మాత్రమే ఉంటుందని వెల్లడించారు. భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, వృద్ధులకు, చిన్నారులకు అనుమతి ఉండదని అధికారులు పేర్కొన్నారు.అనంతగిరి అనంత పద్మనాభస్వామి ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, తిరిగి సాయంత్రం 3 నుంచి 8 గంట ల వరకు దర్శనమివ్వనున్నారు.మిగతా దేవాలయాల్లో నిర్ణీ త సమయాల్లోనే తెరిచి ఉంటాయని అధికారులు తెలిపారు


logo