ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Jun 07, 2020 , 23:52:35

అనుమతిలేని, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం నిర్ణయం

అనుమతిలేని, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు  ప్రభుత్వం నిర్ణయం

వికారాబాద్‌ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న ప్రక్రియ

జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 2949 దరఖాస్తులు

అత్యధికంగా పరిగి మున్సిపాలిటీలో 1410 

సెప్టెంబర్‌ 30 వరకు గడువు పెంపు

 అనుమతులు లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ముందుగా మున్సిపాలిటీల్లో, తర్వాత విలీన గ్రామాల్లో ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా వికారాబాద్‌ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో లే అవుట్‌ క్రమబద్ధీకరణ పథకానికి భారీ స్పందన వస్తున్నది. ఈ ప్రక్రియకు మే 31తో గడువు ముగియగా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో రెండు నెలల పాటు సెలవులు ఉండడంతో  సెప్టెంబర్‌ 30 వరకు గడువు  పొడిగించింది. 2018 మార్చి 30 నాటికి అనుమతిలేని, అక్రమ లేఅవుట్లతో పాటు ప్లాట్లు రిజిస్ట్రర్‌ సేల్‌డీడ్‌ అయిన స్థలాలను మాత్రమే క్రమబద్ధీకరించనున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 2,949 దరఖాస్తులు రాగా, అత్యధికంగా పరిగి మున్సిపాలిటీలో 1410 దరఖాస్తులు వచ్చాయి.  నిర్ణీత గడువు తేదీ వరకు దరఖాస్తు చేసుకుని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

- వికారాబాద్‌, నమస్తే తెలంగాణlogo