మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - Jun 06, 2020 , 23:22:53

మద్గుల్‌ చిట్టంపల్లిలో మద్యం అమ్మితే జరిమానా

మద్గుల్‌ చిట్టంపల్లిలో మద్యం అమ్మితే జరిమానా

  వికారాబాద్‌ టౌన్‌ : మద్గుల్‌ చిట్టంపల్లిలో మద్యపానాన్ని నిషేధించామని కౌన్సిలర్‌ గోపాల్‌ అన్నారు. శనివారం వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని 8వ వార్డులో మద్యపా నాన్ని నిషేధించినట్లు ఎస్‌ఐ లక్ష్మయ్యకు కౌన్సిలర్‌ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్‌ మాట్లాడుతూ మద్గుల్‌ చిట్టంపల్లిలో సంపూర్ణ మద్యపాన నిషేదానికి ప్రజలందరి అంగీకారంతో శ్రీకారం చుట్టామన్నారు. ప్రజల్లో మార్పు రావడం చా లా సంతోషమన్నారు. ఇకపై కాలనీలో ఎవరైనా మద్యం అమ్మకాలు చేస్తే రూ.5000లు జరిమానాతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్‌ఐ లక్ష్మయ్య మాట్లాడుతూ మద్యం అమ్మకాల వల్ల కాలనీలో ప్రశాంతత కరువవుతుందని తెలిపారు. మద్యం నిషేధి ంచడం వల్ల ఎలాంటి గొడవలు జరుగకుండా ఉంటాయన్నారు. కార్యక్రమంలో గుడుపల్లి కౌన్సిలర్‌ సంతోష, పీఎస్‌సీఎస్‌ వైస్‌ చైర్మన్‌ పాండు, మాజీ ఎంపీటీసీ సాయన్న, కాలనీవాసులు ఉన్నారు.logo