సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Jun 06, 2020 , 23:20:06

ఎస్‌ఐకి పాజిటివ్‌

ఎస్‌ఐకి పాజిటివ్‌

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : మరో జిల్లావాసి కరోనా బారిన పడ్డాడు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో పనిచేస్తున్న ఓ ఎస్‌ఐకి శనివారం పాజిటివ్‌ నిర్ధ్దారణ అయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే ప్రస్తుతం ఆ ఎస్సై రంగారెడ్డి జిల్లా బండ్లగూడలో నివాసముంటున్నాడని, ఆయన వికారాబాద్‌ పట్టణం  గంగారం కాలనీకి చెందిన వ్యక్తి అని అధికారులు వెల్లడించారు.

బ్యాంకు ఉద్యోగికి...

  కొత్తూరు: మండల కేంద్రంలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో విధులు నిర్వహిస్తున్న శ్రావణ్‌ కుమార్‌కు శుక్రవారం కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో కొత్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ దామోదర్‌, డాక్టర్‌ కవిత ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది శనివారం బ్యాంకులోని మిగతా ఉద్యోగులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి వ్యాధి లక్షణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బ్యాంకు ఉద్యోగస్తులను 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యసిబ్బంది సూచించారు. అందుకు బ్యాంకు సిబ్బంది ఉన్నతాధికారులకు అభ్యర్థన పెట్టుకున్నట్లు తెలిపారు.



logo