ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Jun 05, 2020 , 23:56:38

స్క్రీనింగ్‌ ఫస్ట్‌.. మాస్క్‌ మస్ట్‌

స్క్రీనింగ్‌ ఫస్ట్‌.. మాస్క్‌ మస్ట్‌

  • కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో కరోనా నివారణకు విస్త్రత ఏర్పాట్లు 

బొంరాస్‌పేట : మండలంలోని చెట్టుపల్లితండా కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో శుక్రవారం శానిటైజేషన్‌ పనులు చేపట్టారు. మార్చిలో వాయిదా పడ్డ పదో తరగతి పరీక్షలను తిరిగి త్వరలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న దృష్ట్యా పాఠశాలలో చదువుతున్న 44 మంది ఎస్సెస్సీ విద్యార్థులు వసతి కోసం పాఠశాలకు వస్తున్నారు. దీంతో కొవిడ్‌ -19 దృష్ట్యా పాఠశాలలో శానిటైజేషన్‌ పనులు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో తరగతి గదులు, వంట గది, మరుగుదొడ్లు, స్నానాల గదులు, డార్మెటరీ ఇలా అన్నింటినీ సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణంతో పిచికారీ చేసి శుభ్రం చేశా రు. పాఠశాలకు వస్తున్న విద్యార్థినులను ఎస్‌వో రాధిక థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి జ్వరం, జలుబు, దగ్గు వంటి పరీక్షలు నిర్వహించి మాస్కులు అందజేశారు. పాఠశాలలో ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని ఆమె సూచించారు.

విద్యార్థినులు బొంరాస్‌పేటలోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో పరీక్షలకు హాజరవుతారని, కరోనా వైరస్‌ దృష్ట్యా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎస్‌వో రాధిక తెలిపారు. భౌతికదూరం పాటించేలా పాఠశాలలో వృత్తాకారంలో గుర్తులు వేశామని ఆమె చెప్పారు. మార్చి 23వ తేదీ నుంచి పాఠశాల నుంచి వెళ్లిన విద్యార్థినులు ఈ రోజు వరకు ఏ ఊరికైనా వెళ్లారా, తల్లిదండ్రులు వలస కూలీలు అయితే ఎక్కడి నుంచి ఎప్పుడు వచ్చారు, విద్యార్థినులు ఉంటున్న గ్రామం ఏ జోన్‌లో ఉంది, గ్రామంలో కొవిడ్‌ -19 కేసులు నమోదయ్యాయా, జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నాయా అని విద్యార్థినుల నుంచి ఒక ఫార్మాట్‌లో వివరాలు సేకరించామని ఎస్‌వో చెప్పారు.logo