గురువారం 02 జూలై 2020
Vikarabad - Jun 05, 2020 , 00:31:56

గోమాత ఆకలి తీర్చడం ధర్మం

గోమాత ఆకలి తీర్చడం ధర్మం

చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు రంగరాజన్‌ స్వామి

శంకర్‌పల్లి : గోమాత ఆకలిని తీర్చడం అందరి ధర్మమని చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు రంగరాజన్‌ స్వామి అన్నారు. గురువారం శంకర్‌పల్లి మండ లం ఇరుక్కుంటతండా గ్రామ సమీపంలోని గోశాలలో ఉన్న 300 గోవులకు లారీ గడ్డి, వరిగడ్డి, చెరుకు దాణాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ గోమాతలో ముక్కోటి దేవతలు కొలువుంటారని.. అలాంటి మాత ఆకలిని తీర్చి తే ఎంతో పుణ్యం లభిస్తుందని తెలిపారు. సనాతన హిందూ సంప్రదాయాలను కాపాడడం మన కర్తవ్యంగా భావించాలని పిలుపునిచ్చారు. గోమాతను పూజించడం వల్ల కరోనా వైరస్‌ బారిన పడకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. ప్రతిఒక్కరూ తమకు తోచిన విధంగా గోవుల సంరక్షణ కోసం సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఇరుక్కుంటతండా సర్పంచ్‌ టీఆర్‌ఎస్‌ నాయకుడు శంకర్‌నాయక్‌ పాల్గొన్నారు.


logo