మంగళవారం 07 జూలై 2020
Vikarabad - Jun 05, 2020 , 00:31:00

మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి: జడ్పీ చైర్‌ పర్సన్‌ సునీతారెడ్డి

మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి: జడ్పీ చైర్‌ పర్సన్‌ సునీతారెడ్డి

వికారాబాద్‌ : మానవాళి మనుగడకు ప్రకృతి చాలా ముఖ్యం . మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి గురువారం తెలి పారు. ప్రకృతిలోని వృక్ష సంపదతో పాటు పశుపక్షాదులను కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ నెల 5న అంతర్జాతీయ ప్రకృతి దినోత్సవం సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఇండ్ల వద్ద, ఆలయాలు, ప్రార్థన మంది రాల ఆవరణల్లో మొక్కలు నాటాలని సూచించారు. ప్రకృతిలోని అన్ని జీవరాశులు కూడా మనుగడ సాధించేలా మానవాళి నడుచుకోవాలని సూచించారు.  ఈ నెల 5న జిల్లాలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పీటీసీలు, మున్సిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు, అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులందరూ హరితహారం మొక్కలు నాటి పక్షులకు, మూగ జీవాలకు నీళ్లు పెట్టాలని ఆమె విజ్ఞప్తి చేశారు.


logo