ఆదివారం 05 జూలై 2020
Vikarabad - Jun 04, 2020 , 01:48:50

రైతులకు అందుబాటులో ఎరువులు

రైతులకు అందుబాటులో ఎరువులు

  • ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి

కులకచర్ల : ప్రభుత్వం రైతులకు అందుబాటులో ఎరువులను ఉంచిందని పరిగి ఎమ్మె ల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని ముజాహిద్‌పూర్‌ లో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫర్టిలైజర్‌ దుకాణాన్ని డీసీసీబీ చైర్మన్‌ బు య్యని మనోహర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ సీఎం కేసీఆర్‌ రైతులకు ఎరువుల సమస్య లేకుండా చేశారన్నారు. పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫర్టిలైజర్‌ దుకాణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫర్టిలైజర్‌ దుకాణాల్లో ఎరువులతోపాటు పెస్టిసైడ్స్‌, విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో కులకచర్ల ఎంపీపీ సత్యమ్మ హరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్‌,  రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు పీరంపల్లి రాజు, మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడు నర్సింహులు, ముజాహిద్‌పూర్‌  రైతుబంధు సమితి అధ్యక్షుడు శ్రీనివాస్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ నర్సింహులు, టీఆర్‌ఎస్‌ నాయకులు రాజప్ప,  తులసీరాం, బొంబాయి రాములునాయక్‌, రామకృష్ణ,  టీఆర్‌ఎస్‌ మండల  ప్రధాన కార్యదర్శి నర్సింహులు ఉన్నారు. 


logo