శనివారం 04 జూలై 2020
Vikarabad - Jun 04, 2020 , 01:44:11

మున్సిపాల్టీని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి

మున్సిపాల్టీని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి

  • ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి

కొడంగల్‌ : కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీని కలిసికట్టుగా కృషిచేసి జిల్లాలోనే ఆద ర్శంగా తీర్చిదిద్దుకోవాలని ఉన్న బడ్జెట్‌తో అభివృద్ధి పనులు చేసుకోవాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, కలెక్టర్‌ పౌసుమి బసు తెలిపారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ వెటర్నరీ దవాఖాన కార్యాలయ ఆవరణలో కలెక్టర్‌ అధ్యక్షతన టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా బడ్జెట్‌ సమావేశం జరిగింది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, అందుకు కావాల్సిన నిధులు, వచ్చే ఆదాయంపై చైర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డి ఏర్పాటు చేసిన నివేదికను కలెక్టర్‌ ముం దుంచారు. వచ్చే ఏడాదికి అంచనా ప్రకారం రూ.2కోట్ల 64లక్షల ఆదాయం సమకూర్చగా, మున్సిపల్‌ పరిధిలో సీసీ, మురుగు కాలువల నిర్మాణాలు, సిబ్బంది వేతనాలు తదితర వాటికి సంబంధించి రూ.2 కోట్ల 63లక్షల ఖర్చు కానుందని అంచనా వేసుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి మార్చి వరకు సంబంధిం చి మున్సిపాలిటీకి రూ.2కోట్ల 81లక్షల ఆదాయం ఉండగా ఖర్చులు పోను రూ.44లక్షల మిగులు బడ్జెట్‌ ఉంటుందన్నారు. వచ్చే ఆదాయంలో 10 శాతం గ్రీనరీ నిర్వహణకు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. కొత్త మున్సిపాలిటీ కావడంతో అభివృద్ధికి సంబంధించి నిధులు పెద్ద మొత్తంలోనే కావాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో బడ్జెట్‌ నివేదికకు కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ వినయ్‌కుమార్‌ తెలిపారు. అనంతరం దవాఖాన ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో వికారాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్యతో పాటు కౌన్సిలర్లు పాల్గొన్నారు.


logo