శుక్రవారం 14 ఆగస్టు 2020
Vikarabad - May 31, 2020 , 23:46:45

సీజనల్‌ వ్యాధులపై ప్రజలు అప్రమత్తం కావాలి

సీజనల్‌ వ్యాధులపై ప్రజలు అప్రమత్తం కావాలి

  • పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
  • ‘పది గంటల 10నిమిషాలు’ పిలుపునకు స్పందన
  • కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యేలు

వికారాబాద్‌/వికారాబాద్‌ టౌన్‌ : సీజనల్‌ వ్యాధులు వ్యా ప్తి చెందకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ అన్నారు. ఆదివారం పది గంటల పది నిమిషాలు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని తన నివాసం బయట ఉన్న మురుగు కాలువలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలంద రూ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. రానున్న వర్షాకాలంలో దోమల వల్ల డెంగీ, మలేరియా, చికెన్‌గున్యా వంటి సీజనల్‌ వ్యాధుల నివారణ కోసం ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలన్నారు. 

పరిశుభ్రంగా ఉంచుకోవాలి

 తమ నివాస పరిసరాలను ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని వికారాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల తెలిపారు. 10గంటలకు 10నిమిషాల కార్యక్రమంలో తమ నివాసంలోని పరిసరాలను శుభ్రం చేశారు. 

తాండూరు : ప్రతిఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తాండూరు మున్సిపల్‌  చైర్‌పర్సన్‌ తాటికొండ స్వప్నపరిమళ్‌ అన్నారు. ఆదివారం కార్యక్రమంలో భాగంగా వారి ఇంట్లో పాత సామాన్లు బయట వేశారు. టీఆర్‌ఎస్వీ జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ ఇంటి ఆవరణంలో మొక్కల  కుండీలను శుభ్రం చేశారు. 

 మొక్కలకు నీళ్లు పోసిన ఎమ్మెల్యే 

షాద్‌నగర్‌టౌన్‌ : ప్రతిఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్‌ అన్నారు. ప్రతి ఆదివారం పరిశుభ్రత అనే కార్యక్రమంలో భాగంగా కేశంపేట మండలం ఎక్లాస్‌ఖాన్‌పేట గ్రామంలోని తన నివాసంలో పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు ఇంటి ముందు ఉన్న మొక్కలకు నీళ్లు పోశారు.

ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి 

సీజనల్‌ వ్యాధుల ప్రబలకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్‌ చైర్మన్‌ కొందూటి నరేందర్‌ పట్టణ ప్రజలకు సూచించారు. పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా తన ఇంటితో పాటు పొలం వద్ద శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే సీజనల్‌ వ్యాధులు వ్యాపించవన్నారు. ఇందులో భాగంగానే మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో స్థానిక కౌన్సిలర్లు ఇంటితోపాటు పరిసరాలను శుభ్రం చేశారు.

ముందు జాగ్రత్తలు పాటించాలి..

ఇబ్రహీంపట్నం/ఇబ్రహీంపట్నంరూరల్‌ : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పలువురు ప్రజాప్రతినిధులు అన్నారు. ఆదివారం ఇబ్రహీం పట్నం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్రవంతి, వైస్‌ చైర్మన్‌ యాదగిరి, పలువురు మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో పరిసరాలను శుభ్రం చేశారు. మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ రమణారెడ్డి తమ ఇంటి ఆవరణలోని పూల తొట్లను శుభ్రం చేశారు.logo