సోమవారం 03 ఆగస్టు 2020
Vikarabad - May 31, 2020 , 23:32:24

చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి : కలెక్టర్‌

చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి : కలెక్టర్‌

వికారాబాద్‌ : రోడ్లపై చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలని, మురుగు కాలువలను వెంటనే శుభ్రం చేయాలని వికారాబాద్‌ కలెక్టర్‌ పౌసుమి బసు మున్సిపల్‌ సిబ్బందికి సూచించారు. ఆదివారం పట్టణంలోని 26వ వార్డు మోతీబాగ్‌ కాలనీలో ఆమె పర్యటించి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమవుతున్న తరుణంలో సీజనల్‌ వ్యాధులు వ్యాప్తి చెం దే అవకాశం ఉంటుందని, ఎక్కడ కూడా మురుగు నీరు నీల్వ ఉండకుండా చూడాలన్నారు. కలెక్టర్‌ వెంట మున్సిపల్‌ కమిషనర్‌ భోగేశ్వర్లు, కౌన్సిలర్‌ పాల్గొన్నారు.


logo