బుధవారం 12 ఆగస్టు 2020
Vikarabad - May 31, 2020 , 00:36:03

మిషన్‌ భగీరథతో ఇంటింటికీ తాగునీరు

 మిషన్‌ భగీరథతో ఇంటింటికీ తాగునీరు

శేరిలింగంపల్లి: రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ కార్యక్రమం ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తామని చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి అన్నారు. శనివారం గచ్చిబౌలి డివిజన్‌ పరిధిలోని సెక్రటరీ కాలనీలో హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ సర్వీస్‌, సీవరేజీ బోర్డు నిధులతో రూ.2.25కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న మంజీరా నీటి పైప్‌లైన్‌ నిర్మాణపనులకు ఎంపీ, ఎమ్మెల్యే అరెకపూడి గాం ధీ, కార్పొరేటర్‌ కొమిరిశెటి ్టసాయిబాబా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గాంధీ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు సక్రమంగా అందేలా చూస్తున్నారన్నారు. ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తామని తెలిపారు. మంజీరా నీటి పైప్‌లైన్‌ పనులను త్వరలోనే పూర్తి చేసి మరిన్ని కుటుంబాలకు నీటిని సరఫరా చేస్తామన్నారు.


logo