బుధవారం 12 ఆగస్టు 2020
Vikarabad - May 31, 2020 , 00:26:55

పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య పనులు నిర్వహించాలి

పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య పనులు నిర్వహించాలి

  • వికారాబాద్‌ కలెక్టర్‌ పౌసుమి బసు
  • బాధ్యతాయుతంగా పని చేయాలి
  • రంగారెడ్డి కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌
  • పారిశుద్ధ్యంపై మున్సిపల్‌ కమిషనర్లు, చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్‌లతో వీడియోకాన్ఫరెన్స్‌

రేపటి నుంచి 8 వరకు చేపట్టబోయే ఇంటెన్సివ్‌ శానిటేషన్‌ డ్రైవ్‌లో భాగంగా పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య పనులు  చేపట్టాలని వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు పౌసుమి బసు, అమయ్‌కుమార్‌ తెలిపారు. శనివారం వికారాబాద్‌లోని వెంకటపూర్‌ తండాలో కలెక్టర్‌, ఎమ్మెల్యే ఆనంద్‌తో కలిసి పారిశుద్ధ్య సమస్యలు గుర్తించారు. రంగారెడ్డి కలెక్టరేట్‌లో పారిశుద్ధ్యంపై మున్సిపల్‌ కమిషనర్లు, చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్లతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వానకాలంలో డెంగీ, మలేరియా, చికున్‌ గున్యా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ: జిల్లాలో జూన్‌ 1 నుం చి 8వరకు నిర్వహించే ఇంటెన్సివ్‌ శానిటేషన్‌ డ్రైవ్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ అమ య్‌ కుమార్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని కోర్టు హాలులో ముమ్మర పారిశుద్ధ్య కార్యక్రమ నిర్వహణపై మున్సిపల్‌ కమిషనర్లు, చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, జిల్లా అధికారులు పాల్గొన్న ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఇంటెన్సివ్‌ డ్రైవ్‌ కార్యక్రమంలో భాగంగా శానిటేషన్‌, తెలంగాణకు హరితహారం, కొవిడ్‌ నియంత్రణ చర్యలు, నీటి సరఫరా, డంపింగ్‌ యార్డుల నిర్మాణం చేపట్టాలన్నారు.

డంపింగ్‌ యార్డుల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలన్నారు. రాబోయేది వర్షాకాలం.. మలేరియా, డెంగ్యూ, చికున్‌ గున్యా వంటి వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణా న్ని ప్రతిరోజూ ఉదయం సాయంత్రం పిచికారీ చేయాలని ఆదేశించారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా జూన్‌ 28 నుంచి ప్రారంభించే కార్యక్రమానికి అం దరూ సిద్ధంగా ఉండాలని.. మొక్కలను నాటేందుకు యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేసుకోవాలన్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించిన పీపీపీ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం చేపట్టాలని కోరారు.

సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు తయారు చేయాలి : కలెక్టర్‌ పౌసుమి బసు

వికారాబాద్‌ : జూన్‌ 1 నుంచి 8వరకు చేపట్టబోయే పారిశుద్ధ్య కార్యక్రమాలు పూర్తిస్థాయిలో నిర్వహించాలని కలెక్టర్‌ పౌసుమి బసు అన్నారు. శనివారం పట్టణంలోని వెంకటపూర్‌తండాలో కలెక్టర్‌, ఎమ్మెల్యే ఆనంద్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులతో కలిసి పర్యటించారు. కాలనీల్లో పారిశుద్ధ్య సమస్యలను గుర్తించా రు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పట్టణంలో గుర్తించిన పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. అందుకు సం బంధించిన ప్రణాళికలు తయారు చేసుకుని పారిశుద్ధ్య పనులను పూర్తి స్థాయిలో నిర్వహించాలన్నారు. పట్టణంలో మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. ఖాళీస్థలాల్లో పిచ్చి మొక్కలను తొలిగించి, తడి, పొడి చెత్తను ప్రతి ఇంటి నుంచి సేకరించాలన్నారు. ఎమ్మెల్యే ఆనంద్‌ మాట్లాడుతూ వర్షాకాలం లో నీరు నిల్వ ఉండడంతో దోమలు పెరిగి డెంగీ, మలేరియా వంటి రోగాలు వచ్చే అవకాశం ఉందని, మంత్రి కేటీఆర్‌ నిర్దేశించిన ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాల కార్యక్రమంలో పాల్గొని పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని కాలనీవాసులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ భోగేశ్వర్లు, కౌన్సిలర్లు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.


logo